Shyamala Navaratri: శ్యామలా నవరాత్రులు.. ఎప్పటి నుంచంటే..
ABN , Publish Date - Jan 16 , 2026 | 04:21 PM
హిందూ క్యాలండర్ ప్రకారం.. ప్రతి ఏడాది నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి. మాఘమాసంలో వచ్చే నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి.
అందరికి దసరా నవరాత్రులే తెలుసు. కానీ ఏడాదికి నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి. అందులో ఒకటి మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రులు మాఘ మాసం ప్రారంభంతో మొదలవుతాయి.
ఫిబ్రవరి 19 నుంచి అంటే.. మాఘ శుద్ధ పాడ్యమితో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న.. మాఘ శుద్ధ నవమితో ఇవి ముగుస్తాయి. ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రతి రోజూ అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో పూజిస్తారు.
ఏడాదికి నాలుగు..
ప్రతి ఏడాది హిందూ క్యాలండర్ ప్రకారం.. నవరాత్రిలు నాలుగు సార్లు జరుగుతాయి.
1) మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు
2) చైత్రమాసంలో వసంత నవరాత్రులు
3) ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు
4) ఆశ్వయుజమాసంలో శరన్నవరాత్రులు
అమ్మవారిని వివిధ రూపాల్లో..
ఈ నవరాత్రుల్లో దుర్గమ్మవారిని వివిధ రూపాల్లో.. అంటే నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్దలతో కొలుస్తారు.
ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే..
ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి.
ఐశ్వర్యం లభిస్తుంది.
అవివాహితులకు వివాహం అవుతుంది.
ఈ నవరాత్రుల్లో ఇలా చేయండి..
ఉదయం, సాయంత్రం బ్రహ్మ ముహూర్తంలో ఆవు నెయ్యితో అమ్మవారికి దీపారాధన చేయాలి.
ఎరుపు రంగు పూలతో ఆమ్మవారిని అలంకరించాలి.
శక్తి కొలది నైవేద్యం.. అంటే పులిహార, పాయసం సమర్పించాలి.
శ్యామలా దండకం చదవాలి. ఇది అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఈ దండకం చదవడం వల్ల బుద్ధి వికసిస్తుంది. జ్ఞానం లభిస్తుంది. వాక్పటుత్వం సిద్ధిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..
For More Devotional News And Telugu News