కండక్టర్ ప్రాణం తీసిన జీరో టికెట్.. అసలేమైందంటే..
ABN , Publish Date - Jan 21 , 2026 | 08:19 AM
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కండక్టర్ రాజ్ కుమార్‌ను ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. దీంతో అతడు తీవ్ర మానసిక క్షోభతో అధిక రక్తపోటుకు గురై మరణించాడు..
వరంగల్, జనవరి 21: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఆర్టీసీ కండక్టర్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యం పాలై అతడు మరణించాడు. దీంతో కండక్టర్ మృతదేహంతో ఆర్టీసీ డిపో ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నర్సంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. నర్సంపేట డిపోలో బొమ్మ రాజ్ కుమార్ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా ప్రయాణికురాలికి ఆధార్ కార్డు లేకున్నా.. జీరో టికెట్ ఇచ్చాడని, మరొకరికి నగదు తీసుకుని జీరో టికెట్ ఇచ్చాడని టీసీ తనిఖీల్లో వెల్లడైంది.
దీంతో నాలుగు రోజుల కిందట అతడిని ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. విధుల నుంచి తొలగించడంతో.. రాజ్ కుమార్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో అధిక రక్తపోటు కారణంగా మంగళవారం ఉదయం మరణించాడు. తమకు న్యాయం చేయాలంటూ అతడి కుటుంబ సభ్యులు నర్సంపేట డిపో ఎదుట.. మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు వచ్చి తమకు సమాధానం ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు భీష్మించుకుని డిపో ఎదుట కూర్చొన్నారు. రాజుకుమార్ స్వస్థలం సంగెం మండలం పల్లారుగూడ.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలు బాగుంటాయి
నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు
For More TG News And Telugu News