Medaram: మహాజాతరకు సకల ఏర్పాట్లు..
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:36 AM
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లను శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 28 నుంచి 31వరకు జాతర జరగనుంది. అయితే.. పెద్దఎత్తున భక్తులు విచ్చేయనుండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి
వివిధ మార్గాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
ట్రాఫిక్ నియంత్రణ పకడ్బందీగా ఉండాలి
తాగునీరు, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి
మంత్రులు లక్ష్మణ్ కుమార్, సీతక్క
హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష
ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram)లో ఈనెల 28 నుంచి 31వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని మం త్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధనసరి సీతక్క తె లిపారు. మేడారం జాతర నిర్వహణపై హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. ఈసారి జరగబోయే మేడారం మహాజాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపా రు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి కుంభమేళాను మించి సమ్మక్క- సారలమ్మల మహాజాతరను నిర్వహించాలని సూచించారు.

రూ.250కోట్లకు పైగా నిధులు వె చ్ఛించి అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. ప్రధానంగా శాశ్వత నిర్మాణాలు, మౌలిక వసతు లు, భద్రత, రవాణా, పారిశుధ్యం, వైద్య సేవలు తదితర ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్మస్థానాలకు చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గా ల్లో సూచిక బోర్డులను, బ్యానర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్ఠంగా ఉండాలని, ప్రత్యేక రూట్‌మ్యా్‌పలతోపాటు అవసరమైన చోట వన్‌వే వ్యవస్థను అమలు చేయాలని అన్నారు. ఈ జాతరపై క్యాబినేట్ మొత్తం దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులందరికీ సులభంగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ వోడీలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, రవాణ, భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టాయిలెట్స్ మరిన్ని పెంచాలని కోరారు. జాతర సందర్భంగా గురు, శుక్రవారాల్లో 40 లక్షల మంది భక్తులు ఉంటారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతలో పనిచేసి సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లను వినియోగించుకుకోవాలని సూచించారు. జాతర సమాచారాన్ని, నిబంధనలను తెలిపే ప్రత్యేక యాప్/క్యూఆర్ కోడ్‌ను రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
అనంతరం మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతిపై ములుగు కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్ష్మణ్ కుమార్, సీఎస్ రామకృష్ణారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచిఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!
Read Latest Telangana News and National News