వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు మేడారం కీర్తి, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.
ప్రసాద్ భార్య రష్మితకు కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
నెల రోజులు దాటినా.. యూరియా కష్టాలు తీరడం లేదు. రాత్రివేల వెళ్లి పడుకున్నా.. ఉదయం వెళ్లి క్యూలో నిల్చున్నా రైతులకు బస్తా దొరుకుతది అన్న గ్యారంటీ లేదు. గత కొన్ని రోజులుగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ యూరియా పంపిణీ చేసే కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు ఆందోళనబాట పట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుపై అయోమయం నెలకొన్నది. ఈనెల 15 సోమవారం నుంచి 21వ తేదీ వరకు మొదటిదఫాగా విద్యాసంస్థల బంద్ పాటించాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈలోగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలిన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.
హనుమకొండలోని ఒక ప్రైవేటు పాఠశాల పదో తరగతి విద్యార్థి పోలేపల్లి జయంత్ వర్ధన్ (15) ఆకస్మిక మరణం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థి మృతి సంచలనం సృష్టించింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ దుర్ఘటన ఒకిం త విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.
మోడెం బాలకృష్ణ.. రాడికల్‌గా విప్లవ బాట పట్టాడు. పీడిత ప్రజానీకం కోసం నాలుగున్నర దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేశారు. ‘జంగు సైరనూదిరో.. జైలులో మాయన్నలు’ అనే పాటకు స్ఫూర్తినిచ్చేలా తన విప్లవ సహచరులు పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావులతో కలిసి మోడెం జైలులోనే జంగ్ సైరన్ మోగించి జైలునే పోరాట కేంద్రంగా మలిచారు.
స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎ్‌ఫఐ) క్రీడా పోటీల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఎస్‌జీఎ్‌ఫఐ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి, రెండో వారంలో మండలస్థాయి టోర్నమెంట్లు పూర్తి కావాలి. మూడో వారంలో జోనల్ (అంతర్‌మండల) టోర్నమెంట్స్‌తో పాటు జిల్లా టీమ్‌ల ఎంపిక జరగాలి.
యూరియా కోసం గత కొన్ని రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు, తోపులాటల మధ్య పంపిణీ కొనసాగింది. ఇప్పుడు అవన్నీ గొడవలు లేకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారుల పక్కా పర్యవేక్షణతో రైతులకు బస్తాల సరఫరా జరుగుతోంది. ధర్నాలకు, రాస్తారోకోలకు తావులేకుండా.. అందరికీ యూరియా అందిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు.