Share News

మేడారంలో.. ఈసారి 600 హుండీలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:30 AM

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో ఈసారి మొత్తం 600 హుండీలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రధానంగా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఓ హుండీని ఏర్పాటుచేయగా.. జాతర ప్రాంగణంలో మొత్తం 600 హుండీలను ఏర్పాటు చేస్తున్నారు.

మేడారంలో.. ఈసారి 600 హుండీలు

  • గత జాతరలో కన్నా 130 ఎక్కువ

  • గద్దెల ప్రాంగణం పెరగడంతో అదనపు హుండీల ఏర్పాటు

  • డిజిటల్‌ చెల్లింపులకు సైతం అవకాశం

వరంగల్: మేడారం(Medaram) సమ్మక్క సారలమ్మ జాతరలో ఈసారి 600 హుండీలను ఏర్పాటు చేస్తున్నారు. గత జాతరలో 470 హుండీలను ఏర్పాటు చేశారు. వనదేవతల గద్దెల ప్రాంగణం పెరగడంతో ఆ మేరకు హుండీల సంఖ్యను పెంచాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. వీటికి పోలీసు శాఖ కూడా అనుమతి ఇచ్చింది. ఇది వరకు సమ్మక్క, సారలమ్మ జాతర గద్దెల ప్రాంగణం చిన్నదిగా ఉండేది. జాతర జరిగిన మూడు రోజులు భక్తులతో క్రిక్కిరిసి పోయేది. దీనితో హుండీలను ఏర్పాటు చేయడానికి చాలినంత స్థలం ఉండేది కాదు. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండదు. రూ101 కోట్ల వ్యయంతో తల్లుల గెద్దలను ఆధునీకరించారు. గద్దెల ప్రాంగణాలను గతంలో కన్నా విస్తరించారు. శిలాస్థంభాలతో సుందరీకరించారు. ఈ దృష్ట్యా ఈ సారి హుండీలను 600 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


క్యూఆర్‌ కోడ్‌ ద్వారా..

గత జాతర వరకు భక్తులు తమ కానుకల ను హుండీలో మాత్రమే వేసే అవకాశం ఉం డేది. ఈసారి డిజిటల్‌ పేమెంట్ల అవకాశం కల్పించారు. జాతర ప్రాంగణంలో క్యూఆర్‌ కోడ్‌లను అందుబాటులో ఉంచారు. భక్తులు స్కాన్‌ చేసి తమ కానుకలను నగుదు రూపంలో ఫోన్‌ ద్వారా చెల్లించవచ్చు. దీంతో సాంప్రదాయిక గిరిజన జాతర ఆధునికతను సంతరించుకున్నట్లయింది.


meda1.2.jpgతగ్గుతున్న బెల్లం కొనుగోళ్లు

మేడారం జాతర అంటే బంగారం (బెల్లం). జాతర వచ్చిందంటే బెల్లం కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరితే నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కుకోవడం ఆనవాయితీ. తులాభారం వేసి నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. భక్తులు నిలువెత్తు బంగారం చెల్లిస్తామన్న మొక్కును చెల్లించుకుంటున్నారు కానీ అదిపూర్తిగా బెల్లం రూపంలో కాదు. భక్తు లు ఇది వరకటిలా తమ బరువును బట్టి తూగే బెల్లాన్ని మొత్తంగా కొనడంలేదు. మొత్తం బరు వులో తూగే బెల్లంలో ఒకటింట మూడో వంతు బెల్లం కొని మిగతా మొత్తాన్ని ఆ విలువ మేర కు నగదు రూపంలో హుండీలో వేస్తున్నారు. దీని వల్ల బెల్లాన్ని గద్దెల వరకు మోసుకు వెళ్లే శ్రమ తగ్గడమే కాకుండా అంత బెల్లాన్ని పంచిపెట్టడంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలుగుతున్నాయి. మరికొందరు భక్తులు బెల్లం బదులు చెక్కెర కొనుగోలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

చైనా మాంజాకు ఐదేళ్ల బాలిక బలి

హింసను ప్రశ్నించినా బెదిరింపులే!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 27 , 2026 | 11:30 AM