సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
ఆదివాసీల కుంభమేళా మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే మేడారం ఆలయ అభివృద్ధి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మేడారం మూలాలను కాపాడుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీల మనోభావాలకు తగినట్టుగా గద్దెల మార్పులు చేస్తున్నామని చెప్పారు. పూజారులతో మరోసారి సీఎం చర్చించి డిజైన్‌లు ఫైనల్ చేస్తారని వెల్లడించారు.
ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారం క్షేత్రంలో చరిత్రాత్మక మార్పులు రాబోతున్నాయి. రెండేళ్లకోసారి కోటి మందిని రప్పించే కోన ఆధునిక రూపును సంతరించుకోనుంది. ‘మాస్టర్ ప్లాన్’ పేరుతో మేడారాన్ని మరింత సౌలభ్యంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు చెదరకుండా గద్దెలను పునర్నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.
భూపాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా నడుస్తోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
కొత్త ఠాణాలు, ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా ఠాణాల ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. కొత్త జిల్లాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర సర్కారు నడుబిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఏటా ఏటా నెల రోజుల పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి ఆరోగ్యవంతంగా ఉండడం కోసం తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది పోషణ మాసాన్ని విజయవంతం చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు పోషణ మాసం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఓరుగల్లులో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. కాంగ్రె్‌సలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మాట ల యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఽధర్మకర్తల నియామకంపై నాయిని చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. దీనికి తోడు ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను సురేఖ వరంగల్ జిల్లాలో అవిష్కరణ చేసేలా ఉత్తర్వులు రావడానికి నేతల మధ్య విభేదాలే కారణమనే చర్చ జరుగుతోంది.