Share News

భద్రకాళి అమ్మవారికి 111 కిలోల వెండి అభరణాలు బహూకరణ

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:10 AM

వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి పెన్నా సిమెంట్స్‌ అధినేత ఉత్తమ్‌రెడ్డి ప్రతా్‌పరెడ్డి అత్యంత విలువైన బంగారు, వెండి ఆభరణాలు బహూకరించారు. రూ.4 కోట్ల విలువైన 111 కిలోల వెండి ఆభరణాల తొడుగు....

భద్రకాళి అమ్మవారికి 111 కిలోల వెండి అభరణాలు బహూకరణ

  • 310గ్రాముల బంగారు పుస్తెలు కూడాబహూకరించిన పెన్నా సిమెంట్స్‌ అధినేత

వరంగల్‌ కల్చరల్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి పెన్నా సిమెంట్స్‌ అధినేత ఉత్తమ్‌రెడ్డి ప్రతా్‌పరెడ్డి అత్యంత విలువైన బంగారు, వెండి ఆభరణాలు బహూకరించారు. రూ.4 కోట్ల విలువైన 111 కిలోల వెండి ఆభరణాల తొడుగు, రూ.50 లక్షల విలువైన 310 గ్రాముల బంగారు పుస్తెల ఆభరణాలను దేవస్థానానికి అందజేశారు. దేవాలయ చరిత్రలో ప్రైవేటు దాతల నుంచి రూ.కోట్ల విలువైన ఆభరణాలు అమ్మవారికి రావడం ఇదే మొదటిసారని ఈవో రామల సునీత తెలిపారు. ప్రతా్‌పరెడ్డి కుటుంబ సభ్యులు గతంలో కూడా అమ్మవారి అభిషేకం కోసం నవ కలశాలు, 9 వెండి చెంబులు, ఒక కిలో బంగారు చెంబును బహుకరించారని ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు.

విచారం

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో చర్చ సందర్భంగా ఈనెల 23వ తేదీన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావును వ్యాఖ్యాత వెంకటకృష్ణ గెటవుట్‌ ఫ్రం మై డిబేట్‌ అని వ్యాఖ్యానించడంపై ఏబీఎన్‌ చానల్‌ విచారం వ్యక్తం చేస్తోంది. జర్నలిస్టులను ఉద్దేశించి పిచ్చి నా..’ అంటూ రవీందర్‌ రావు దూషించడంతో వ్యాఖ్యాత అలా అనాల్సి వచ్చింది. అయితే, అతిథిని చర్చకు పిలిచి, గెటవుట్‌ అనడం అనుచితం అనే ఉద్దేశంతో ఏబీఎన్‌ దీనిపై విచారం వ్యక్తం చేస్తోంది. అసభ్య పదజాలం వాడిన రవీందర్‌ రావు, ఆయనను సమర్థించిన బీఆర్‌ఎస్‌ కూడా ఈ విషయంలో విచారం వ్యక్తం చేయడం సముచితంగా ఉంటుంది. ఈ విషయంలో నిర్ణయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.

Updated Date - Jan 30 , 2026 | 04:10 AM