కాజీపేట రైల్ తయారీ కేంద్రం పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఉన్నతాధికారులు వివరించారు.
75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వరి రైతులకు మాటిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 8.5 లక్షల మంది రైతులకు రూ. 8,400 కోట్లు నగదు చెల్లించామన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ చేయనున్నది.
వన్యప్రాణులు, పక్షులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తు చేస్తూ.. గూడూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని జాతీయ రహదారి, అంతర్గత రహదారులకు ఇరువైపుల అటవీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పిల్లర్లపై వన్యప్రాణులు, పక్షుల చిత్రాలతో ఆందంగా తీర్చిదిద్దారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేద పాఠశాలకు భూమిపూజ చేయనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురంలో అరటి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. 11KV విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించి.. ఈ పుష్కరాలను ప్రారంభించారు.
హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలోని బరిస్టా జ్యూస్ సెంటర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
రంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపనకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది.