ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది.
ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం నిర్వహించనున్నారు. మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ నుండి గుత్తి కోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన వరంగల్‌లో పర్యటించనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై రాహుల్ గాంధీ ప్రజల రియాక్షన్ తెలుసుకోనున్నారు. అలాగే రైల్వే ప్రయివేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని ఖమ్మం జైలుకు తరలించారు.
అజాం జాహి మిల్లు భూములకు సంబంధించి హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, వరంగల్ వాసి సుద్దాల నాగరాజు తప్పుడు ప్రతాలు సృష్టించారని మావోయిస్టు నేతలు ఆరోపించారు. ఆ తప్పుడు పత్రాలతో వారు మిల్లు భూములు అమ్మేసి డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు.
వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
జయశంకర్ భూపాలపల్లి: శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై తెలంగాణ దేవాదాయశాఖ స్పందించింది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈవో మారుతిపై బదిలీ వేటు పడింది.
వరంగల్: నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న కల్యాణి ఆస్పత్రి ఘటన మరువకముందే నేడు మరో దారుణం బయటపడింది. ఏకశిలా ఆస్పత్రి యాజమాన్యం తన మెడికల్ రిపోర్టులు మార్చారంటూ హనుమకొండ జిల్లా వంగపహాడ్‌కు చెందిన ప్రశాంత్ ఆందోళనకు దిగాడు.
వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మామునూరు వద్ద లారీ అదుపుతప్పి రెండు ఆటోలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
Maoist party: పూజార్ కంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ శనివారం ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసుల తీరుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.