Mahabubabad Wife Incident: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తపై కత్తితో దాడి చేసిన భార్య
ABN , Publish Date - Sep 15 , 2025 | 07:25 PM
ప్రసాద్ భార్య రష్మితకు కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
మహబూబాబాద్: ఒక్కప్పుడు భార్యలపై కొంతమంది భర్తలు వేధింపులకు పాల్పడేవారు. వారిని కేవలం వంటగదికే పరిమితం చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరించేవారు. వరకట్నం, అదనపు కట్నం పేరుతో భౌతికదాడులకు సైతం పాల్పడేవారు. చివరికి వారి ప్రాణాలు తీసేందుకూ వెనకాడే వారు కాదు. కానీ.. ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పెళ్లి చేసుకోవాలంటేనే యువకులు ఒణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేస్తున్న వరస ఘటనలే ఇందుకు కారణం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఓ భార్య యత్నించింది.
ప్రసాద్ భార్య రష్మితకు కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, ఆదివారం అర్ధరాత్రి ప్రియుడు అనిల్‌తో కలిసి భర్త ప్రసాద్‌పై రష్మిత విచక్షణారహితంగా కత్తితో దాడి చేసింది.
ఈ దాడిలో ప్రసాద్ గట్టిగా కేకలు వేయడంతో స్థానిక ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు. పారిపోతున్న ప్రియుడు అనిల్‌ను పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ ప్రసాద్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం, ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. పోస్టింగ్‌లు
లిక్కర్ స్కామ్ కేసులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్
For More Latest News