IAS Officers Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. పోస్టింగ్‌లు
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:35 PM
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నాలుగు రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీపై దృష్టిపెట్టిన చంద్రబాబు సర్కార్.. ఇవాళ(సోమవారం) మరి కొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏలూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.దాత్రి రెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న గీతాంజలి శర్మను ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా నియమించారు. ఇక, పాడేరు సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న శౌర్యమాన్ పటేల్‌ను మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం.
Also Read:
డ్వాక్రా సంఘాల టర్నోవర్ 10 లక్షల కోట్లకు ఎదగాలి: సీఎం చంద్రబాబు
లిక్కర్ స్కామ్ కేసులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్
For More Latest News