AP CM Chandrababu: డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:44 PM
మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తాజాగా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అమరావతి: మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తాజాగా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. తాను ప్రారంభించిన డ్వాక్రా సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారని, పొదుపు చేసి దాచుకున్న డబ్బులతోపాటు రివాల్వింగ్ ఫండ్ ద్వారా మహిళా సంఘాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని సీఎం అన్నారు. డ్వాక్రా సంఘాల రూపంలో కోటి 20 లక్షల మందితో కూడిన అతిపెద్ద మహిళా సైన్యం రాష్ట్రానికి ఉందని అన్నారు (AP CM Chandrababu).
మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టేనని, డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయవంతంగా డ్వాక్రా సంఘాలను నిర్వహిస్తున్న సెర్ప్ ఉన్నతాధికారులను అభినందించారు (Dwakra groups in AP). సంక్షేమ శాఖలు, పీ4 తదితర అంశాలపైనా జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్లు తప్పనిసరిగా సందర్శించాలని, విద్యార్థులకు ఇచ్చే ఆహారం, నీరు, దుప్పట్లు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు (AP News).
పీ4 అనేది మరో గేమ్ చేంజర్ కార్యక్రమం అని, వాలంటరీగానే అంతా ముందుకు రావాలి తప్ప ఎవరినీ బలవంతం చేయాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు సూచించారు. పీ4, డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేసి ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుందామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల్లో తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. 1.2 కోట్ల కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకువెళ్తే వ్యవస్థే మారుతుందని, దేశానికి ఇదో మోడల్‌గా నిలుస్తుందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News