AP Liquor Scam Update: లిక్కర్ స్కామ్ కేసులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:42 PM
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో మూడో అదనపు ఛార్జ్ షీట్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో సోమవారం దాఖలు చేసింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో మూడో అదనపు ఛార్జ్ షీట్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు SIT మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చగా.. 12 మందిని అరెస్టు చేసింది. ఇదే కేసులో నలుగురికి ఇటీవల ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ పాత్రను తాజా ఛార్జ్ షీట్‌లో సిట్ స్పష్టంగా పేర్కొంది. ఈ స్కామ్ లో కొల్లగొట్టిన డబ్బును ఈ నలుగురి ద్వారా ఎలా మళ్లించారో ఛార్జ్ షీట్‌లో సిట్ వివరించింది.
ప్రస్తుతం గుంటూరు జైల్లో బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో వరుసగా ఒక్కొక్కరి పాత్రపై ఛార్జ్ షీట్‌లో సిట్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్ లో నిధుల మళ్లింపుపై SIT ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది.
Also Read:
కుక్క ఎంత స్మార్ట్‌గా ఆలోచించిందో.. నీటిలో పడబోతున్న పిల్లాడిని ఎలా కాపాడిందో చూడండి..
సినిమా చూస్తూ మైక్రోవేవ్‌లో వండిన పాప్‌కార్న్ తింటున్నారా? బీ కేర్ ఫుల్
For More Latest News