Share News

Dog saves child: కుక్క ఎంత స్మార్ట్‌గా ఆలోచించిందో.. నీటిలో పడబోతున్న పిల్లాడిని ఎలా కాపాడిందో చూడండి..

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:32 PM

సాధారణంగా కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. తమ యజమానులను ఎంతగానో ప్రేమిస్తాయి. యజమానులకు ఏమైనా అయితే ఎంతగానో తల్లడిల్లిపోతాయి. కుక్కలు విశ్వాసమైనవే కాదు.. తెలివైనవి కూడా. ఏదైనా ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తిని అద్భుతంగా ఉపయోగిస్తాయి.

Dog saves child: కుక్క ఎంత స్మార్ట్‌గా ఆలోచించిందో.. నీటిలో పడబోతున్న పిల్లాడిని ఎలా కాపాడిందో చూడండి..
Dog saves child

సాధారణంగా కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. తమ యజమానులను ఎంతగానో ప్రేమిస్తాయి. యజమానులకు ఏమైనా అయితే ఎంతగానో తల్లడిల్లిపోతాయి. కుక్కలు విశ్వాసమైనవే కాదు.. తెలివైనవి కూడా. ఏదైనా ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తిని అద్భుతంగా ఉపయోగిస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని కుక్క ఫాస్ట్‌గా రియాక్ట్ అయి ఓ చిన్నారిని కాపాడింది (Dog saves child).


therealdogmani అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Dogesh Bhai viral video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక మహిళ బట్టలు ఉతుకుతుండగా, పక్కనే ఆమె బిడ్డ బేబీ కేరింగ్ ట్రాలీలో కూర్చుని ఆడుకుంటోంది. వారి పెంపుడు కుక్క కూడా పక్కనే ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆ ట్రాలీ ముందుకు కదలి కింద పడబోయింది. పక్కనే ఉన్న పెంపుడు కుక్క వెంటనే స్పందించి ముందుకు దూకి ఆ ట్రాలీ కింద పడకుండా పట్టుకుంది. దీంతో ఆ చిన్నారి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు (viral pet video).


ఈ వీడియోను (ఆmotional dog story) సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. 18 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ కుక్క కామన్‌సెన్స్ ఆ చిన్నారిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని ఒకరు కామెంట్ చేశారు. పెంపుడు కుక్క హీరోలా మారి ఆ చిన్నారి ప్రాణాలను రక్షించిందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

పైలెట్లు పెర్ఫ్యూమ్ ఎందుకు వేసుకోరు.. అసలు కారణమేంటో తెలిస్తే..

ఆరోగ్యం బాగోలేదని బాస్‌కు మెసేజ్.. పది నిమిషాల్లోనే ఎంతో ఘోరం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2025 | 04:32 PM