Microwave Popcorn Side Effects: సినిమా చూస్తూ మైక్రోవేవ్‌లో వండిన పాప్‌కార్న్ తింటున్నారా? బీ కేర్ ఫుల్
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:09 PM
మనలో చాలా మందికి సినిమా చూస్తున్నప్పుడు పాప్‌కార్న్ తినే అలవాటు ఉంటుంది. అయితే, సినిమా చూస్తూ మైక్రోవేవ్‌లో వండిన పాప్‌కార్న్ తింటే ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది పాప్‌కార్న్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి దీనిని సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. సినిమా చూస్తూ ఎక్కువగా పాప్‌కార్న్ తింటారు. అయితే, సినిమా చూస్తూ మైక్రోవేవ్‌లో వండిన పాప్‌కార్న్ తింటే ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?
మైక్రోవేవ్ పాప్‌కార్న్ మీ ఊపిరితిత్తులకు చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2012లో అమెరికాలోని ఒక వ్యక్తి ప్రతిరోజూ రెండు ప్యాకెట్ల మైక్రోవేవ్ పాప్‌కార్న్ తిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పాప్‌కార్న్‌ను అతిగా తినడం వల్ల తన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. మైక్రోవేవ్‌లో వండిన పాప్‌కార్న్ తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దీని ప్యాకేజింగ్‌లో ఉండే PFAS (పర్- పాలిఫ్లోరోఆల్కైల్ పదార్థాలు) అనే రసాయనాలు క్యాన్సర్‌తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఈ రసాయనాలు మైక్రోవేవ్ వేడికి గురైనప్పుడు ఆహారంలోకి ప్రవేశించి, శరీరంలో చేరి, ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్‌లకు PFAS రసాయనాలకు గురికావడం కారణమని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ రసాయనాలు ఊపిరితిత్తుల సమస్యలను కూడా కలిగించవచ్చు. అంతేకాకుండా, శరీరంలో ఈ రసాయనాలు పేరుకుపోయి, దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ముప్పు తెస్తాయి. మీకు అదే పనిగా దగ్గు లేదా శ్వాస ఆడకపోవడం ఉంటే, వెంటనే వైద్యులను సంప్రదించండి.
Also Read:
ఓర్నీ.. ఫస్ట్‌నైట్‌ను కూడా వదలరా.. కెమెరాల ముందు ఓ కొత్త జంట ఏం చేస్తోందో చూడండి..
ఆడవాళ్లు.. అదే పనిగా నైటీలు వేసుకుంటున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..!
For More Latest News