Share News

Lip locked couple: ఓర్నీ.. ఫస్ట్‌నైట్‌ను కూడా వదలరా.. కెమెరాల ముందు ఓ కొత్త జంట ఏం చేస్తోందో చూడండి..

ABN , Publish Date - Sep 15 , 2025 | 02:56 PM

డిజిటల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత చాలా మంది తమకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాము చేసుకునే ఫంక్షన్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

Lip locked couple: ఓర్నీ.. ఫస్ట్‌నైట్‌ను కూడా వదలరా.. కెమెరాల ముందు ఓ కొత్త జంట ఏం చేస్తోందో చూడండి..
Suhaag Raat vlogging

ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత చాలా మంది తమకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాము చేసుకునే ఫంక్షన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే కొందరు నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయాలను కూడా నలుగురితో పంచుకుంటూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ జంట చేసిన పని చూసి చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు (Wedding photoshoot controversy).


తాజాగా వివాహం చేసుకున్న ఓ జంట తమ ఫస్ట్ నైట్ వ్లోగ్ అంటూ నెట్టింట రచ్చ చేసింది (viral wedding video). ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కొత్త జంట కెమెరాల ముందు ముద్దుల దాడికి దిగింది. ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటుండగా ఎదురుగా కొందరు కెమెరాలను పట్టుకుని ఆ ఇంటిమేట్ మూమెంట్స్‌ను బంధిస్తున్నారు. ఆ వీడియోను జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు (Suhaag Raat vlogging).


@coolfunnytshirt అనే ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ లక్షల మంది వీక్షించారు (Netizens reaction). ఇలాంటి వీడియోలను పోస్ట్ చేసే వారిని ఏమనాలో అర్థం కావడం లేదని ఒకరు కామెంట్ చేశారు. ప్రతిదానికి హద్దులు ఉంటాయని కొందరు వాటిని మర్చిపోతున్నారని మరొకరు విమర్శించారు. వ్యూస్, లైక్స్ కోసం శృంగారాన్ని నడివీధిలోకి తీసుకొస్తారా? అని మరొకరు ప్రశ్నించారు. ఈ వీడియోపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.


ఇవి కూడా చదవండి..

పైలెట్లు పెర్ఫ్యూమ్ ఎందుకు వేసుకోరు.. అసలు కారణమేంటో తెలిస్తే..

ఆరోగ్యం బాగోలేదని బాస్‌కు మెసేజ్.. పది నిమిషాల్లోనే ఎంతో ఘోరం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2025 | 03:29 PM