Share News

Womens Health: ఆడవాళ్లు.. అదే పనిగా నైటీలు వేసుకుంటున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..!

ABN , Publish Date - Sep 15 , 2025 | 02:55 PM

ఆడవాళ్లు ఇదివరకు కేవలం చీరల్లో మాత్రమే ఉండేవారు. కానీ, ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా ఎక్కువగా నైటీలోనే కనిపిస్తున్నారు. అయితే..

Womens Health:  ఆడవాళ్లు.. అదే పనిగా నైటీలు వేసుకుంటున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..!
Women Wearing Nighties

ఇంటర్నెట్ డెస్క్: ఆడవాళ్ల వస్త్రధారణలో చాలా మార్పు వచ్చింది. ఇది వరకు రోజుల్లో ఆడవాళ్లు ఎక్కువగా లంగా వోణీలు, చీరలు వంటివి వేసుకునేవారు. రాను రాను ఆ పాత పద్ధతులు పోయాయి. ఇక, చీరలతో ఫ్రీగా ఉండలేమని చాలా మంది ఆడవాళ్లు డ్రెస్సులు వేసుకోవడం లేదంటే నైటీలు వేసుకోవడం చేస్తున్నారు. నిజానికి, రాత్రి పూట వేసుకునేది కాబట్టి దానిని నైటీ అన్నారు కానీ ఉదయం పూట కూడా చాలా మంది ఆడవాళ్లు నైటీలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. నైటీలు వేసుకుంటే తమకు ఫ్రీగా ఉంటుందని భావిస్తారు. అయితే, నైటీలు అదే పనిగా వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి.


నైటీలు సాధారణంగా తేలికైన, వదులైన వస్త్రాలతో తయారవుతాయి. అదే పనిగా నైటీ ధరించడం వల్ల చర్మానికి సరైన గాలి తగలదు. ఇది ముఖ్యంగా వేడి వాతావరణంలో చెమట పేరుకుపోయి చర్మ వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. నైటీలు కేవలం రాత్రిపూట ధరించడానికి మాత్రమే తయారు చేయబడిన దుస్తులు. బయట తిరగడం, వంట చేయడం వంటి పనులు చేసేటప్పుడు నైటీలు ధరించడం సరైనది కాదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా పాడవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


చీర కట్టుకోవడం వల్ల ఏమవుతుంది?

చీర శరీరానికి టైట్‌గా అనిపిస్తుంది. కొన్ని శరీర భాగాలని బిగ పెట్టి ఉంచుతుంది. అలా ఉంచడం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీని వల్ల చీర కట్టుకునే ఆడవాళ్ళ ఆకృతి చాలా బాగుంటుంది. అలా కాకుండా, నైటీలు ఎక్కువగా వేసుకుంటే బాడీలో కొవ్వు చాలా ప్రాంతాల్లో పెరిగిపోతోంది. నైటీలు వేసుకోవడం వలన శరీరాకృతి మారిపోతుంది.

అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే, నైటీలలో ఉండటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే, నైటీలు ధరించి బయటకు వెళ్లడం సామాజికంగా కూడా సరైనది కాదు. అందువల్ల, ఆరోగ్యంగా ఉండటానికి, సామాజికంగా మెరుగ్గా కనిపించడానికి రాత్రిపూట మాత్రమే నైటీలు ధరించాలి, పగటిపూట ఇంట్లో ఉన్నా సౌకర్యవంతమైన ఇతర దుస్తులు ధరించడం మంచిది.


Also Read:

బరువు తగ్గాలనుకునే వారు తప్పక పాటించాల్సిన చిట్కాలు

మానసికంగా దృఢంగా ఉండాలనుకుంటున్నారా.. ఈ చిట్కాలు మీ కోసమే..

For More Latest News

Updated Date - Sep 15 , 2025 | 02:55 PM