Home » Telangana » Rangareddy
భారీ వర్షాల కారణంగా ప్రహరీ గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉపరాష్ట్రపతి పదవి అధికారం కాదు..అది గౌరవ ప్రదమైన రాజ్యాంగ పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి పదవికి తాను సరైన వాడినని... అర్హులైన వారిని నిర్ణయించుకొని ఓటేయాలని ఎంపీలను సుదర్శన్ రెడ్డి కోరారు.
కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాంచందర్ రావు జోస్యం చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలోని రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబానగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Rangareddy Road Accident: లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
Kavitha Slams Congress Govt: సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం చేయడం తప్ప పాలన తెలీదంటూ కవిత విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని ఆరోపించారు.
Leopard Scare: రంగారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం నస్కల్ గ్రామంలో దారుణం జరిగింది. పోషణ భారమైందని ఎనభై ఏళ్ల వయసున్న కన్న తల్లి సత్యమ్మను, పక్షవాతంతో బాధపడుతున్న తమ్ముడు మహిపాల్ రెడ్డిని ఇంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి గెంటి వేశాడు.
పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. నిన్న(సోమవారం) అర్థరాత్రి తల్లి, కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
తన ఆఫీసుకెళ్లిన సందర్భంలో ఇంట్లోని నగలను స్నేహితురాలు ఆమె బాయ్ ఫ్రెండ్ చోరీ చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డి గూడలో ఈ ఘటన వెలుగు చూసింది.