Medchal Ganja Gang: జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం..
ABN , Publish Date - Jan 06 , 2026 | 10:36 AM
జీడిమెట్ల పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి సేవించడాన్ని అడ్డుకున్న ఇద్దరు మహిళలపై గంజాయి బ్యాచ్ దారుణంగా ప్రవర్తించింది.
మేడ్చల్, జనవరి 6: జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఆ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు శృతిమించి పోతున్నాయి. కొంతమంది గంజాయిని సేవించి చుట్టుపక్కల వారి పట్ల అసభ్యరీతిలో ప్రవర్తించడం కలకలం రేపుతోంది. గంజాయి బ్యాచ్ హల్‌చల్‌తో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ ఎల్‌బీనగర్‌లో గత అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ దారుణానికి పాల్పడింది. హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న పవన్ కళ్యాణ్ (20), సంఘీ(20) అనే యువకులను కాలనీకి చెందిన మహిళలు నిలదీశారు.
దీంతో గంజాయి మత్తులో ఆ ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. తమను నిలదీసిన ఇద్దరు మహిళలను విచక్షణారహితంగా చితకబాదారు. వీరి దాడిలో ఆ ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కాలనీ వాసులు గాయపడ్డ మహిళలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే ఇద్దరు గంజాయి బ్యాచ్ యువకులను పట్టుకుని దేహశుద్ది చేసి.. ఆపై పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తమ కాలనీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయని.. వారి బారి నుంచి తమను రక్షించాలని.. గంజాయిని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..
ఫాల్కన్ స్కామ్‌లో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో ఎండీ
Read Latest Telangana News And Telugu News