Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌లో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో ఎండీ
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:26 AM
ఫాల్కన్ ఎండీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలను కొట్టేసి దుబాయ్ పారిపోయిన అమర్ దీప్‌ను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, జనవరి 6: ఫాల్కన్ స్కామ్ కేసులో (Falcon Scam Case) పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఫాల్కన్ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్ దీప్‌ను పోలీసులు పట్టుకున్నారు. ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో ఫాల్కన్ ఎండీని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాల్కన్ ఎండీపై ఇప్పటికే ఎల్ఓసీ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై వచ్చిన వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. డిజిటల్ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్లను అమర్ దీప్ కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. యాప్ బేసిడ్ డిజిటల్ డిపాజిట్ల పేరుతో అమర్ దీప్ స్కామ్‌కు పాల్పడినట్లు తేలింది. అంతేకాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ బురిడీ కొట్టించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే అమర్ దీప్ దంపతులు చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్ దీప్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా.. ఎట్టకేలకు ముంబైలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
అమ్మో.. ఈ నీటిని ఎలా తాగేది...
పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..
Read Latest Telangana News And Telugu News