Rabid Dog Attacks: పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..
ABN , Publish Date - Jan 06 , 2026 | 08:09 AM
భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
నిర్మల్, జనవరి6 (ఆంధ్రజ్యోతి): భైంసా (Bhainsa) పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం (Rabid Dog Attacks) సృష్టించింది. నిన్న(సోమవారం) ఒక్కరోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్క కాటు బాధితులు భారీగా చేరారు. ఆస్పత్రి వైద్యులు తక్షణం మెడికల్ సహాయం అందిస్తున్నారు.
స్థానికుల ఆవేదన
పిచ్చి కుక్కలను పట్టుకోవడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి సరైన పరిష్కారం రాలేదని ఆవేదన చెందుతున్నారు. శునకాల దాడులతో తీవ్ర భయాందోళన చెందుతున్నామని వాపోయారు. తమ ప్రాణాలను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిచ్చి కుక్కల దాడులపై ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శునకాల దాడులు ప్రతిరోజూ పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని ప్రజలు హెచ్చరించారు. అధికారులు త్వరగా పిచ్చి కుక్కలను పట్టుకోవాలని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News