Dog Attack: వీధి కుక్కల బీభత్సం.. నాలుగేళ్ల బాలుడిపై దారుణంగా
ABN , Publish Date - Jan 01 , 2026 | 04:24 PM
రంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా కరిచాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
రంగారెడ్డి, జనవరి 1: జిల్లాలోని హైదర్షాకోట్‌లోని శాంతినగర్ కాలనీలో కుక్కలు వీరంగం సృష్టించాయి. కాలనీలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. వేదాంత్ రెడ్డి అనే బాలుడిని చుట్టుముట్టిన నాలుగు కుక్కలు విచక్షణారహితంగా కరిచినట్లు స్థానికులు తెలిపారు. కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నాడు. కుక్కల దాడి ఘటనతో కాలనీలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
అయితే ఇదే ప్రాంతంలో గతంలోనూ కుక్కల దాడుల ఘటనలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని హిమగిరి కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని, చిన్నారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
మందుబాబులకు షాక్ ఇచ్చిన పోలీసులు.. భారీగా కేసులు
Read Latest Telangana News And Telugu News