భువనగిరి జిల్లా ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ అందుబాటులోకి వచ్చింది.
చింతలపాలెం మండలం సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న టీఎ్‌సజెనకో పవర్‌ప్లాంట్‌లో బుధవారం విద్యుత ఉత్పత్తి ప్రారంభమైంది. ఎగువన తగినంత వర్షాలు లేకపోవడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం సుమారు 2000 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తూ 15 మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చేస్తున్నారు.
తాటిచెట్టు పైనుంచి పడి గాయపడినా, మరణించినా గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థికసహాయం, బీమా సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందాయి. దీంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో 10వ తేదీ తర్వాతనే వచ్చేవి. దీంతో ఉద్యోగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
ఆర్డీవో కార్యాలయాల్లో చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మిశ్రమ స్పందన వస్తోంది. మే 4వ తేదీన ప్రారంభం కాగా కలెక్టరేట్‌లో మాదిరిగానే ప్రతీ సోమవారం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు.
వర్షాకాలం ఆరంభ మాసం జూన్ అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. జూన్ మా సంలో నైరుతి రుతుపవనాలు కమ్ముకొని ము మ్మరంగా వర్షాలు కురవాల్సి ఉండగా, వరుణు డు ముఖం చాటేశాడు.
ఆహా ర భద్రత పథకంలో భాగంగా పేదలకు అందిస్తున్న బియ్యం సరఫరా జూలై కోటా విడుదలైంది.నేటినుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. కొద్ది మాసాలుగా మూడు నెలలకు ఒకేసారి బియ్యం కోటా పం పిణీ చేస్తున్న పౌరసరఫరాలశాఖ జూలై మా సం నుంచి ప్రతీ నెల బియ్యం కోటాను లబ్ధిదారులకు అందజేయనుంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధి లో పెద్దగుట్టపై అభివృద్ధి చేసిన టెంపుల్‌సిటీ లేఅవుట్ లో భక్తులకు వసతి సదుపాయాల కల్పన నిమిత్తం అతిథిగృహాల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
రోగుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడట మే లక్ష్యంతో పనిచేసే వైద్యుల ఆరోగ్య పరిరక్షణ రోజురోజుకూ కొరవడుతోంది. మెజార్టీ వైద్యులు రోజులో 12 నుంచి 16గంటల పాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధి నిర్వహణలో ఉంటారు.
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. 2025న నవంబరు 4న చిలుకూరు పోలీసులు రాజే్‌షను అరెస్ట్ చేసి 10న రిమాండ్ చేశారు. హుజుర్‌నగర్ సబ్‌జైల్‌లో రాజేష్ అస్వస్ధతకు గురికావడంతో హైదరాబాద్‌కు తరలించారు.