మ్యాన్‌హోల్స్‌తో జర భద్రం
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:31 AM
యాదగిరిగుట్ట పట్టణంలోని ఏడో వార్డులో పాతగుండ్లపల్లి ప్రాథమిక పాఠశాల వెనుక భాగాన ఉన్న సీసీరోడ్డు మధ్యలో మ్యాన్‌హోల్స్‌కు గత ఏడాది నుంచి వాటికి పై కప్పులు వేయకుండా సంబందిత అధికారులు వాటిని గాలికి వదిలివేశారు.
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట పట్టణంలోని ఏడో వార్డులో పాతగుండ్లపల్లి ప్రాథమిక పాఠశాల వెనుక భాగాన ఉన్న సీసీరోడ్డు మధ్యలో మ్యాన్‌హోల్స్‌కు గత ఏడాది నుంచి వాటికి పై కప్పులు వేయకుండా సంబందిత అధికారులు వాటిని గాలికి వదిలివేశారు. నిత్యం పాఠశాలకు, అంగన్‌వాడీ పాఠశాలకు సుమారు 100మంది వరకు పాఠశాలకు చెందిన విద్యార్థులు, సుమా రు 20 మంది వరకు అంగన్‌వాడీ పాఠశాలకు విద్యార్థులు వచ్చి వెళుతుంటారు. ఆ రోడ్డు నట్టనడుమ మ్యాన్‌హోల్స్ రెండు పెద్దగా పైకప్పులు వేయకుండా పెద్దహోల్స్‌తో ప్రమాదం పొంచి ఉంది. అభం శుభం తెలియని చిన్నారులు ఆరోడ్డు వెంట వెళుతూ పైకప్పులు లేని మ్యాన్‌హోల్స్‌లో పొరపాటున పడితే మృత్యువాత పడకతప్పదు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు వెంటవెళుతూ మ్యాన్‌హోల్స్ గమనించకుండా అందులో పడితే పెద్దప్రమాదాలు జరుగక తప్పదు. ఇలా ప్రమాదాలు పొంచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో విద్యార్థులు పడిప్రమాదానికి గురికాకుండా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మ్యాన్‌హోల్స్‌కు మరమ్మతులు చేపట్టాలి
-గోవిందరావు, ఉపాధ్యాయుడు
పాఠశాల వెనుక ఉన్న సీసీరోడ్డు మధ్యలో పై కప్పులు లేకుండా ప్రమాదాన్ని పొంచిఉన్న మ్యాన్‌హోల్స్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఇప్పటికే మరమతులు చేపట్టాలని సంబంధిత మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశాం. మూతలు లేకుండా ఉన్న మ్యాన్‌హోల్స్‌లో ప్రమాద వశాత్తున పడే అవకాశం ఉంది. వెంటనే మరమ్మతులు చేపట్టి మ్యాన్‌హోల్స్‌పై మూతలు వేసి ప్రమాదాలను అరికట్టాలి.
మరమ్మతులు చేయిస్తాం
-మిర్యాల లింగస్వామి, మునిసిపల్ కమిషనర్
పాతగుండ్లపల్లి ప్రాథమిక పాఠశాల వెనుకభాఆగాన సీసీరోడ్డుపై మూత లేకుండా మ్యాన్‌హోల్ ఉన్నట్లు నా దృష్టికి రాలేదు. మ్యాన్‌హోల్స్‌పై కప్పులు లేకుండా ఉన్న వాటిని పరిశీలించి, మరమత్ము చేయిస్తా. విద్యార్థులు, ద్విచక్రవాహన దారులు ప్రమాదానికి గురికాకుండా చర్యలు తీసుకుంటా.