Share News

మున్సిపోల్స్‌కు కసరత్తు

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:27 AM

మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగం గా రాష్ట్ర ఎన్నికల కమిషన ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది.

మున్సిపోల్స్‌కు కసరత్తు

మునిసిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితా

4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ

5, 6వ తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు

జిల్లాలో మొత్తం ఓటర్లు 2,26,695 మంది

మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగం గా రాష్ట్ర ఎన్నికల కమిషన ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది. మునిసిపల్‌ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల సీఎం రేవంతరెడ్డి ప్రకటనతో మునిసిపాలిటీల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించడానికి ప్రధానంగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఈనెల 10వ తేదీ నాటికి పూర్తి చేసి తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.

- (ఆంధ్రజ్యోతి,సూర్యాపేట (కలెక్టరేట్‌)

సీఎం రేవంతరెడ్డి ప్రకటనతో మునిసిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. త్వరలో మునిసిపల్‌ ఎన్నిక లు పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న ఆశావాహులంతా వారి పనుల్లో నిమగ్నమవుతున్నా రు.నూతన ఓటరుజాబితా తయారు చేసేందుకు ప్రక్రి య ప్రారంభమైంది. వార్డుల విభజన జరిగింది. వార్డుల విభజనకు సంబంధించి ప్రాంతాలు ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు అత్యఽధిక గ్రామాల్లో విజయం సాధించారు. ఇదే ఊపుతో మునిసిపల్‌ ఎన్నికలను వాయిదా వేయకుండా ఫిబ్రవరి నెలలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఓటరు జాబితా ఖరారుకు..

మునిసిపల్‌ ఎన్నికల కోసం జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో ఈనెల ఒకటో తేదీన ముసాయిదా ఓట రు జాబితాలను విడుదల చేశారు. ఆ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 4వ తేదీలోపు ఫి ర్యాదులు స్వీకరించ నున్నారు. అనంతరం ఈనెల 5న మునిసిపాలిటీ పరిధి, ఈనెల 6న కలెక్టరేట్‌లో గుర్తిం పు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం ఓటరు జాబితాల్లో ఏమైనా సవరణలు ఉంటే సరిచేసి ఈనెల 10న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.

ఐదు మునిసిపాలిటీలు.. 141 వార్డులు

జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో మొత్తం 141... వార్డులు ఉన్నాయి. సూర్యాపేట మునిసిపాలిటీలో 48 వార్డులు, కోదాడలో 35 వార్డులు, హుజూర్‌నగర్‌లో 28 వార్డులు, నేరేడుచర్లలో 15 వార్డులు, తిరుమలగిరిలో 15 వార్డులు ఉన్నాయి. ఈ మునిసిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రకా రం మొత్తం ఓటర్లు 2,26,695 మంది ఉన్నారు. పురుషులు ుు1,08,798 మంది, మహిళలు 1, 17, 863 మంది, ఇతరులు 34 మంది ఓటర్లుగా ఉన్నారు.

రాజకీయ పార్టీల సమావేశాలు

మునిసిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వివిధ రాజకీయ పార్టీలు పత్ర్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో విజయం సాధిం చాలని అందుకోసం బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట మునిసిపాలిటీకి సంబంధించి మునిసిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశపడుతున్న ఆశావహుల జాబితాను స్వీకరించి అందులో గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయించే అవకాశాలున్నాయి. అదే విధంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ, టీఆర్‌పీ, సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా పార్టీ సమావేశాలు నిర్వహించనున్నాయి.

Updated Date - Jan 02 , 2026 | 12:27 AM