Share News

సావిత్రీబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:38 AM

సావిత్రీబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకమని నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రేఖ అన్నారు.

సావిత్రీబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం

రామన్నపేట, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సావిత్రీబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకమని నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రేఖ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌లో సావిత్రీబాయిపూలే జన్మదినం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు ఉన్నతాధికారులుగా, ఉపాధ్యాయులుగా వివిధ సబ్జెక్టులు బోధించి ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రేఖ సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రీబాయి పూలే మహిళల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ నాగరాజు విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు అక్రమ్‌, సంధ్య, స్వప్న, విజయశ్రీ, లత, వినీష పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:38 AM