గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:36 AM
గ్రంథాలయాలు, విద్యాలయాలు విజ్ఞాన భాండాగారాలని పుస్తకాలు ఉన్నచోటనే దేవతలు ఉంటారని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కూరెళ్ల విఠలాచార్య అన్నారు.
రామన్నపేట, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : గ్రంథాలయాలు, విద్యాలయాలు విజ్ఞాన భాండాగారాలని పుస్తకాలు ఉన్నచోటనే దేవతలు ఉంటారని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కూరెళ్ల విఠలాచార్య అన్నారు. సోమవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో విఠలాచార్య ఏర్పాటు చేసిన లైబ్రరీని భూదానపోచంపల్లికి చెందిన లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సోమవారం సందర్శించారు. వెల్లంకి గ్రామానికి చెందిన కర్నాటి ఎడ్యుకేషన సొసైటీ ఛైర్మన కర్నాటి శ్రవన కుమార్ విఠలాచార్యను శాలువాతో సన్మానించారు. గ్రంథాలయం కోసం పుస్తకాలను, వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో కర్నాటి ఎడ్యుకేషన సొసైటీ ఉపాధ్యక్షులు కర్నాటి మహదేవ్, కర్నాటి నరసింహ, గంజి భాస్కర్, లైబ్రేరియాన తాటిపాముల స్వామి, వనం శిరీష, స్కూలు ప్రిన్సిపాల్ కాశీనాథ్, అధ్యాపకులు పాల్గొన్నారు.