రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువల సవరణను పలుమార్లు వాయి దా వేసి ఎట్టకేలకు శుక్రవారం నుం చి అమలులోకి తెచ్చింది. ఈసారి భూముల విలువలు పెరుగుతాయ నే అనుమానంతో ఆస్తుల క్రయ, విక్రయదారులు గురువారం వరకు పెద్ద మొత్తంలో స్లాట్లు బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
జిల్లాలో గ్రామీణులకు నిత్యం ఉపాధి కల్పిస్తున్న ఉపాధిహామీ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు నివారించేందుకు తీసుకువచ్చిన ఉపాధిహామీ పథకంలో ప్రతిరోజూ పనిచేస్తున్నా ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో కుటుంబపోషణ ఇబ్బందిగా మారుతోంది.
సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మార్కెట్ భూ విలువలు భారీగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాం తాల్లో పెరిగిన భూముల ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. శుక్రవారం సూర్యాపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 48 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి.
వర్షాకాలం సమీపించింది. మరో వారంలోగా వానలు కురుస్తాయని వాతావరణశాఖకు ప్రకటించింది. అయితే వర్షం పడితే జిల్లా కేంద్రంలో వీధుల్లో నడి చే పరిస్థితి లేదని పట్టణ ప్రజలు భయపడుతున్నారు. అస్తవ్యస్త రహదారులతో వాహనదారులు జంకుతున్నారు.
పర్యావరణ చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధివీలత అన్నారు.
సేవలే పరమావధిగా భావించే రెడ్‌క్రాస్ సొసైటీ భువనగిరిలో బ్లడ్ బ్యాంకు నిర్మాణానికి సంకల్పించింది. సొసైటీ ఉదారతతో త్వరలో తలసేమియా బాధితులకు వ్యధ, రోడ్డు ప్రమాద తదితర బాధితులకు రక్తం కొరత తీరనుంది.
విద్యా సంవత్సరం ప్రారంభానికే ముందే ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అన్ని మరమ్మతు పనులను ఈ నెల 10లోగా పూర్తిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారి ని ప్రోత్సహించేందుకు ఓ ఉపాధ్యాయుడు తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థినులకు విమానయాన అవకాశం క ల్పించారు.
గత సీజన్‌లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలకు తెలియకుండానే ఓ వరి రకం విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. అసలు ఈ రకం విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
అమరుల త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని పలువురు వక్తలు అన్నారు.