Share News

Searching for candidates :గెలిచే వార్డుల కోసం అభ్యర్థుల అన్వేషణ

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:34 AM

మునిసిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో అభ్యర్థులు గెలిచే వార్డుల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా చైర్మన్‌ రేసులో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. వారు నివాసం ఉండే వార్డులో కాకుండా పక్క వార్డు నుంచి పోటీచేస్తే విజయావకాశాలపై ఆరాతీస్తున్నారు.

Searching for candidates :గెలిచే వార్డుల కోసం అభ్యర్థుల అన్వేషణ

వీలైతే పక్కవార్డు నుంచి చేయాలని నిర్ణయాలు

ఆ వార్డు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్న అభ్యర్థులు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట) : మునిసిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో అభ్యర్థులు గెలిచే వార్డుల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా చైర్మన్‌ రేసులో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. వారు నివాసం ఉండే వార్డులో కాకుండా పక్క వార్డు నుంచి పోటీచేస్తే విజయావకాశాలపై ఆరాతీస్తున్నారు. వార్డులో ఉన్న పెద్దల ను కలిసి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పట్టణంలో ఓటు ఉంటే చాలు ఏ వార్డు నుంచైనా పోటీ చేయవచ్చు.

జిల్లాలో మొత్తం ఐదు మునిసిపాలిటీలు ఉండగా, సూర్యాపేట మునిసిపాలిటీ చైర్మన్‌ జనరల్‌ కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉంది. గతంలో పలువురు చైర్మన్‌ పదవిని ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం జనర ల్‌ కావడంతో ఈసారైనా తమకు దక్కుతుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కోదాడలో జనరల్‌ మహిళ, హుజూర్‌నగర్‌ బీసీ జనరల్‌, నేరేడుచర్ల జనరల్‌, తిరుమలగిరి మునిసిపల్‌ చైర్మన్‌ స్థానా న్ని జనరల్‌కు కేటాయించారు. జిల్లాలో ఐదు మునిసిపాలిటీలు ఉండగా మూడింటిని జనరల్‌ స్థానాలకు, కోదాడ జనరల్‌ మహిళకు కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉంది.

పక్క వార్డులకూ ఆర్థిక సహాయం

మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులు వారు పోటీ చేసే వార్డుల్లోనేగాక పక్క వార్డులకు కూడా ఆర్థిక సహా యం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒకపార్టీ నుంచి పోటీచేసిన వ్యక్తి పక్క వార్డుల్లో అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేసి గెలిపించినా ఆయనకు చైర్మన్‌ పదవి దక్కలేదు. డబ్బు పోయింది తప్ప చైర్మన్‌ పదవి దక్కలేదని ఆయన నిరాశపడ్డారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ జరగనుంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్‌లు కూడా సత్తాచాటే అవకాశం ఉంది. జిల్లాలో రెండు మూడు సార్లు గెలిచిన అభ్యర్థులు కూడా మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. వార్డుల్లో ఎలా గెలవాలో పోలింగ్‌ మేనేజ్‌మెంట్‌ వారికి బాగా తెలుసుండటం తో మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు

సర్పంచ్‌ ఎన్నికల్లో గుర్తులు లేకపోవడంతో ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచారో తెలియని పరిస్థితి ఉంది. గెలిచిన అభ్యర్థి తమ వాడేనంటూ అన్ని పార్టీలు ప్రచారం చేసుకున్నాయి. అయితే మునిసిపల్‌ ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ గుర్తులతో ఉండనున్నాయి. దీం తో ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచారో స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో మునిసిపల్‌ ఎన్నికలపై మూడుమార్లు సమావేశాలు నిర్వహించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకునున్నారు. బలమైన అభ్యర్థుల కోసం ఆయా వార్డుల నుంచి దరఖాస్తులు తీసుకొని పరిశీలన చేస్తున్నారు. వీలైతే ఒక బహిరంగ సభను నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానించి హామీల వర్షం కురిపించే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి పదేళ్లుగా మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా మునిసిపల్‌ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మునిసిపల్‌ ఎన్నికలపై రెండుమార్లు సమావేశాలు సైతం నిర్వహించారు. ఈ పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం జిల్లా కేంద్రంలో చేసిన అభివృద్ధి పనులపై నూతన క్యాలెండర్లు ముద్రించి వార్డు నాయకులతో ఆయా వార్డుల్లో ఇంటింటికీ పంపిణీ చేయిస్తున్నారు. అయితే బీఆర్‌ఎ్‌సకు నేటికీ హుజూర్‌నగర్‌కు పార్టీ ఇన్‌చార్జీని నియమించలేదు. మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి సూర్యాపేట, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ సైతం మునిసిపల్‌ ఎన్నికలపై సన్నాహక సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో మునిసిపాలిటీలో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. సర్పంచ్‌ ఎన్నికల్లో ఆశించిన ఫలితా లు రాకపోవడంతో మునిసిపాలిటీలోనైనా ఫలితాలు రాబట్టాలని చూస్తోంది. ఆ పార్టీకి కొన్ని మునిసిపాలిటీల్లో సంస్థాగతంగా బలంగా లేకపోవడం మైన్‌సగా మారింది. ఏ పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే ఎంత ఖర్చుచేసైనా గెలవాలని కొంత మంది అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. అవసరమైతే అందుకు వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు విక్రయించాలని చూస్తున్నారు. సూర్యాపేటలో 48 వార్డులు, కోదాడలో 35, హుజూర్‌నగర్‌లో 28, నేరేడుచర్లలో 15, తిరుమలగిరిలో 15వార్డులు ఉన్నాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:34 AM