Rajesh's case: రాజేష్ కేసును సీబీఐకి అప్పగించాలి
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:36 AM
లాక్‌పడెత్‌కు గురైన కర్ల రాజే ష్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
సూర్యాపేటటౌన్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): లాక్‌పడెత్‌కు గురైన కర్ల రాజే ష్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీస్‌స్టేషన్ లాక్‌పలకు సంబంధించిన సమాచారం ఎస్పీ, డీఎస్పీలకు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసి రాజేష్ మరణానికి కారకులయ్యారని ఆరోపించారు. రాజేష్ మృతదేహానికి పోస్టుమార్టంకు ముందు ఎస్పీ కావాలనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి సీఐని, ఎస్‌లను పంపించారని తెలిపారు. అక్రమ నిర్బంధం, పోలీసుల చిత్ర హింసిలకు గురై లాక్‌పడెత్ అయిన కర్ల రాజేష్ మృతికి కారణమైన హోంగార్డు నుంచి ఎస్పీ వరకు ఎవరు నేరస్తులైన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసును డీఐసీ లేదా ఐజీ స్థాయి అదికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 100 లాక్‌పడెత్‌లు జరిగి తే అందులో ఒక శాతం కూడా పోలీసులకు శిక్షపడలేదని తెలిపారు. లాక్‌పడెత్ బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదని మానవహక్కుల కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆవేదనవ్యక్తం చేశారు. రాజేష్ లాక్‌పడెత్‌తో ఎస్పీ, డీఎస్పీకి సంబంధం ఉందని డిమాండ్ చేస్తున్నామని, కాదని బహిరంగ చర్చ కు రావడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షుడు గోవింద్ నరే్‌షమాదిగ, జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్‌మాదిగ, విశ్వనాథంమాదిగ, జయకర్‌మాదిగ, యాతాకుల రాజయ్యమాదిగ, డప్పు మల్లయ్య, బచ్చలకూరి వెంకటేశ్వర్లు, జానకిరామయ్యచౌదరి, చింతలపాటి చినశ్రీరాములు, ఎర్రవీరస్వామి, చింత వినయ్, పాల్గొన్నారు.