Share News

టికెట్‌ వచ్చేవరకూ ఉత్కంఠే

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:28 AM

జిల్లావ్యాప్తంగా ఒక్కొ కౌన్సిలర్‌ టికెట్‌ కు నలుగురుకు పైగా పోటీ పడుతున్నా రు. అధికార పార్టీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల లో ఈ పోటీ తీవ్రంగా ఉంది. మాజీ కౌన్సిలర్లతోపాటు కొత్తగా పోటీ చేయాలని పలువురు తహతహలాడుతు న్నారు.

టికెట్‌ వచ్చేవరకూ ఉత్కంఠే

ఒక్కో కౌన్సిలర్‌ టికెట్‌కు ఒకే పార్టీలో నలుగురుకిపైగా పోటీ

కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలోనే పోటీ ఎక్కువ

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా ఒక్కొ కౌన్సిలర్‌ టికెట్‌ కు నలుగురుకు పైగా పోటీ పడుతున్నా రు. అధికార పార్టీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల లో ఈ పోటీ తీవ్రంగా ఉంది. మాజీ కౌన్సిలర్లతోపాటు కొత్తగా పోటీ చేయాలని పలువురు తహతహలాడుతు న్నారు. ఖర్చుకు వెనుకాడబోమని.. టికెట్‌ ఇప్పించాలని కొత్తవారు కోరుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వార్డులలో సర్వే కూడా చేయిస్తోంది. ఏజెన్సీల ద్వారా వార్డుల సర్వే చేయించి ఎవరికి టికెట్‌ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయో బేరీజు వేస్తున్నారు. పోటీలో నిలబడే వారు గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది.

సూర్యాపేట మునిసిపాలిటీలో 48 వార్డులుండగా కొన్ని శివారు ప్రాంతాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో పిల్లలమర్రి, కుడకుడ, కుసుమవారిగూడెం, వెదిరెవారిగూడెం, కేటీ అన్నారం, బీబీగూడెం, దురాజ్‌పల్లి, ఖాసీంపేట గ్రామాలను ముని సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో వార్డుల సంఖ్య పెరిగింది. గత ముని సిపల్‌ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎ స్‌కు కాంగ్రెస్‌, బీజేపీ లు గట్టి పోటీ ఇచ్చాయి. ఈసారి అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మునిసిపల్‌ చైర్మన్‌ పదవి చేజారకూడదని పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తోం ది. కనీసం 24 స్థానాలు గెలిస్తేనే చైర్మన్‌ పదవి దక్కుతుంది. సూర్యాపేట మునిసిపల్‌ చైర్మన్‌ పదవి జనర ల్‌ కావడంతో పోటీ కూడా తీవ్రంగానే ఉంది. మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఆయన కూడా ఈ ఎన్నికల ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే ఇటీవల స్వల్పంగా అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయ న సూర్యాపేటకు రాగానే అభ్యర్థుల ఎంపికకు కసర త్తు చేసే అవకాశం ఉంది. హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి లేకపోవడంతో జగదీ్‌షరెడ్డి అక్కడ కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.

ముందు ప్రకటించకుండా వ్యూహాలు..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ ఇన్‌ చార్జిలు చైర్మన్‌ అభ్యర్థులను ముందుగా ప్రకటించడం లేదు. అందర్ని పోటీ చేయమని సలహా ఇస్తున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి ఎంపిక చేసే అవకాశం ఉంది. కోదాడలో 35 వార్డులుండగా మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ పదవి మహిళకు కేటాయించారు. అక్కడ ముందుగానే చైర్‌పర్సన్‌ పదవి ప్రకటిస్తేనే మిగతా కౌన్సిలర్లకు కొంత ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ విడుదలై అభ్యర్థుల ఉపసంహర ణ తర్వాత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. హుజూర్‌నగర్‌లో 28వార్డులుండగా మునిసిపల్‌ చైర్మన్‌ పద వి బీసీ జనరల్‌కు రిజర్వేషన్‌ అయ్యింది.ఇక్కడ కూడా పోటీ తీవ్రంగానే ఉంది. ఒక్కొ కౌన్సిలర్‌ స్థానానికి న లుగురు అభ్యర్థులకుపైగా పోటీ పడుతున్నారు.నేరేడుచర్ల మునిసిపాలిటీలో 15వార్డులుండగా ఒక్కొ వార్డు కు 10మందికి పైగా పోటీ పడే సందర్భాలూ ఉన్నా యి. మునిసిపల్‌ చైర్మన్‌ పదవి జనరల్‌కు రిజర్వేషన్‌ చేశారు. తిరుమలగిరి మునిసిపాలిటీలో 15 వార్డులు ఉండగా అక్కడ కూడా జనరల్‌కు కేటాయించారు. జిల్లాలో ఐదు మునిసిపాలిటీలు ఉంటే దాదాపు నాలుగు జనరల్‌ కావడం విశేషం. కేవలం హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీ మాత్రం బీసీ జనరల్‌ అయ్యింది.

ఇంటింటికీ తిరుగుతున్న అభ్యర్థులు

పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ఇంటింటికీ తిరుగుతూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు. కొంతమంది కేవలం డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తుండగా, మరికొంతమంది తాము నిత్యం ప్రజల్లో ఉండేవారమని, తమను గెలిపిస్తే ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఒక వార్డు బీసీ లేదా జనరల్‌ అవుతుందని ఆశించిన అభ్యర్థి గత ఐదేళ్లలో లక్షల్లో ఖర్చు చేశాడు. తీరా చూస్తే అ వార్డు ఎస్సీకి రిజర్వ్‌ అయ్యింది. దీంతో పూర్తిగా నిరాశలో ఉన్నారు. ఎంతోమంది అభ్యర్థులు తాము గతంలో గెలిచిన వార్డులు కాకుండా కొత్తవాటిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కొత్తగా మళ్లీ ఆయా వార్డుల్లో పరిచయాలు పెంచుకోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు గట్టి అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, సీపీఎం, సీపీఐలు కూడా బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నాయి. కొంతమంది ఏ పార్టీ టికెట్‌ రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు స్వతంత్రంగా తమ సత్తా చాటాలని ఉరకలేస్తున్నారు. మొత్తం మీద ఈసారి బ్యాలెట్‌ పేపర్‌లో 10 మందికి తక్కువ కాకుండా అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం ఉంది.

Updated Date - Jan 26 , 2026 | 12:28 AM