సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల 14న వృద్ధురాలి హత్య కేసును హుజూర్నగర్ పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాలు, అప్పు పత్రాల కోసం మద్యం తాపించి మత్తులోకి వెళ్లాక వృద్ధురాలిని హత్య చేసిన ముగ్గురిని రిమాండ్కు తరలించారు.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన యువకుడు బ్రెయినడెడ్ కాగా, కుటుంబ సభ్యులు అతడి అవయవాలు దానంచేసి ఆదర్శంగా నిలిచారు.
పూజల్లో వినియోగించే ప్రధానమైన కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో నిత్యం ఆరాధనలు, పూజలు కొనసాగుతాయి.
ఎత్తయిన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం. వాటి మధ్య పరుచుకున్న ప్రకృతి పచ్చదనం, చల్లటి గాలులు, పక్షుల కిలకిల రావాలతో నల్లగొండ జిల్లా మర్రిగూడ మం డలం అజిలాపురం బుగ్గజలపాతం పర్యాటకులను మైమరిపిస్తోంది.
గ్రామీణ ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి దాతలు ముందుకొచ్చి అనేక గ్రామాల్లో కంటిచూపును అందించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
మోటకొండూరు మండలంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు.
బీసీల బంద్కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే పర్మిట్ రూం లేకుండా వైన్స్ నిర్వహించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. దొంగ చాటుగా బెల్ట్ దుకాణాలకు సరఫరా, అధిక ధరలతో సిండికెట్గా మారి డూప్లికేట్ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు.
తెలంగాణలో ఆదివారం వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మణికొండ, మిర్యాలగూడ పట్టణం హనుమాన్ పేటలో జరిగిన ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది.