పురపోరులో నేతలకే అగ్ని పరీక్ష
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:37 AM
మునిసిపల్ పోరు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు అగ్ని పరీక్షలా మారింది. ఎన్నికల వేడి తీవ్రస్థాయికి చేరడంతో ఆయావార్డుల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, పట్టణ ముఖ్యనాయకులకంటే అసెంబ్లీ నియోజవర్గ అగ్రనాయకులే అలుపెరుగని వార్డు పర్యటన లు, పాదయాత్రలు, ప్రచారాలు సాగిస్తున్నారు.
అలుపెరగని ప్రచారాలు.. వార్డు పర్యటనలు
అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పట్టుకోసం వ్యూహ, ప్రతివ్యూహాలు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): మునిసిపల్ పోరు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు అగ్ని పరీక్షలా మారింది. ఎన్నికల వేడి తీవ్రస్థాయికి చేరడంతో ఆయావార్డుల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, పట్టణ ముఖ్యనాయకులకంటే అసెంబ్లీ నియోజవర్గ అగ్రనాయకులే అలుపెరుగని వార్డు పర్యటన లు, పాదయాత్రలు, ప్రచారాలు సాగిస్తున్నారు. ఆయా పార్టీల గుర్తులపై జరుగుతున్న ఈ ఎన్నికల్లో పట్టు సడలిపోకుండా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నారు.
జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీలతోపాటు నియోజవర్గ ఇన్‌చార్జీలు గెలుపే లక్ష్యంగా కృషి చేసి గణనీయమైన ఓట్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. జిల్లాలో ఆరు పురపాలక సంఘాలకు ప్రధాన పార్టీల మధ్య ప్రచార పోరు నువ్వా..! నేనా... ? అన్నరీతిలో సాగిస్తున్నారు. ఈ ఆరు మునిసిపాలిటీల్లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భువనగిరి, భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీల్లో ప్రధానపార్టీల ముఖ్యనేతలు దృష్టి సారించారు. ఈ మునిసిపాలిటీల్లో మకాం వేసి ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెంది న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నియోజవకర్గంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులను ఇన్‌చార్జీలుగా నియమించి, స్వయంగా వార్డుల్లో ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నారు. భూదాన్‌పోచంపల్లిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పూర్తి బాధ్యతలతో పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు ముఖ్యనాయకులతో కలిసి భువనగిరి, భూదాన్‌పోచంపల్లిలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయా వార్డుల్లో పరిస్థితులను పరిశీలించి, గెలుపుకోసం కార్యకర్తలను గెలుపుకోసం కార్యోన్ముకులను చేస్తున్నారు. బీజేపీనుంచి పలువురు ముఖ్యనేతలు రెండు మున్సిపాలిటీల్లో బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, ఎన్నికల ఇన్‌చార్జీ చంద్రశేఖర్‌గౌడ్‌తోపాటు రాష్ట్ర నాయకులు వేముల అశోక్, గూడూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, పోతంశెట్టి రవీందర్, వట్టిపల్లి శ్రీనివా్‌సగౌడ్ తదితరులు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.
అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా..
జిల్లాలోని మునుగోడు ని యోజకవర్గంలోని చౌటుప్పల్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒంటిచేతితో ముందుకు నడిపిస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రె్‌సకు ధీటు గా బరిలో పోరాడటానికి అవసరమైన ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల విజయానికి మాజీ ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి పర్యవేక్షణ చేస్తుండగా, ఇప్పటి కే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మా జీ ఎంపీ డాక్టర్ బూర నర్స య్య గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఇక ఈ మునిసిపాలిటీలో సీపీఎం అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యే మందుల సామేలు చేపట్టగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీత క్క, పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం మాజీ ఎమ్మె ల్యే గాదరి కిషోర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి ధర్మేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల ప్రచార బాధ్యతలను నియోజకవర్గ ఇన్‌చార్జీ కడియం రామచంద్రయ్య, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి డాక్టర్ సమత సమన్వయం చేస్తూ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.
ప్రచారంలో ఉరుకులు.. పరుగులు
జిల్లాలోని ఆలేరు అసెంబ్లీ సెగ్మంట్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టతోపాటు నియోజకవర్గ కేంద్రం ఆలేరు మునిసిపల్ ఎన్నికలు అధికార కాంగ్రె్‌సతోపాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్టగా మారిం ది. దీంతో ముఖ్యనాయకులంతా ఎన్నికల్లో చురుకుగా పాల్గొని ప్రచారాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల గెలుపును స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తన భుజస్కందాలపై వేసుకుని ముందుకు తీసుకెళుతున్నారు. ఆయనతోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణితోపాటు ఇతర ముఖ్యనాయకులు వార్డులు, ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తున్నారు. ఇక భారత రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థు ల గెలుపుకోసం గొంగిడి సునీత మహేందర్ రెడ్డి రాత్రింబవళ్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు మనో దైర్యం కల్పిస్తూ, ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేస్తున్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అభ్యర్థుల గెలుపు కోసం యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపాలిటీల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, మునిసిపల్ రాష్ట్ర ఇన్‌చార్జీ బండ్రు విజయలక్ష్మీ ముఖ్యనాయకులతో ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. అసెంబ్లీ నియోజవర్గ ఇన్‌చార్జీ పడాల శ్రీనివాస్ రెండు మునిసిపాలిటీల్లో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ పాల్గొంటున్నారు.