గ్రామ పంచాయతీలకు మహర్దశ
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:53 AM
:గ్రామీణ పాలనకు బలమైన ఆర్థిక పునాది వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా, కొత్త పాలకవర్గా లు కొలువుదీరాయి. దీంతో కేంద్రం 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది.
కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
జిల్లాకు రూ.2.17 కోట్లు వచ్చే అవకాశం
నిధుల విడుదలపై సర్పంచ్‌ల హర్షం
(ఆంధ్రజ్యోతి,బీబీనగర్) :గ్రామీణ పాలనకు బలమైన ఆర్థిక పునాది వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా, కొత్త పాలకవర్గా లు కొలువుదీరాయి. దీంతో కేంద్రం 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జాప్యం కావడంతో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.2, 500కోట్ల ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గురువారం రాష్ట్రానికి తొలి విడతలో రూ.259. 36కోట్లు విడుదలయ్యాయి. వీటిని ప్రభుత్వం జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా జిల్లాలకు కేటాయిస్తుంది. జిల్లా వాటాగా రూ.2.17కోట్లు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 421 పంచాయతీలు, 17 మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌కు ఈ నిధులను 85:10:5 నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. అంటే పంచాయతీలకు 85శాతం, మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్‌కు 5శాతం చొప్పున నిధులు వాటి ఖాతాల్లో జమ అవుతాయి.
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థి క సంఘం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌ లిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అందు లో తాగునీరు, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, మురుగు కాల్వల నిర్మాణాలు, తదితర మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు. తద్వారా గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగు పడనున్నాయి.
సర్పంచ్‌ల హర్షం
పంచాయతీల్లో పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నిధుల కోసం ఎదురు చూస్తున్న సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీచేయడంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. నిధుల విడుదలపై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. దీంతో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా గ్రామాల్లో నీటి సరఫరా, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, వీధి దీపాల ఏర్పాటుపై సర్పంచ్‌లు దృష్టిసారించనున్నారు.
పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలి :శ్రీనివా్‌సగౌడ్, బీబీనగర్ సర్పంచ్
రాష్ట్రానికి రావాల్సిన రూ.2500కోట్ల ఆర్థిక సంఘం నిధులను కేంద్రం పూర్తిస్థాయిలో విడుదల చేసి ఉంటే బాగుండేది. పంచాయతీలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరేవి. దీంతో ఎక్కువ పనులు చేసే అవకాశం ఉండేది. తొలి విడతలో విడుదలైన రూ.259కోట్లలో రాష్ట్రంలోని పంచాయతీలకు జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేస్తే చిన్న పంచాయతీలకు వేలల్లో, పెద్ద పంచాయతీలకు లక్ష రూపాయలకు అటు ఇటుగా నిధులు సమకూరనున్నాయి.