Share News

‘ఉపాధి’ హామీలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల కొరత

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:50 AM

గ్రామీణ ప్రాంతంలో వలసలను నిర్మూలించేందుకు 20 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తెచ్చింది. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును వీబీజీరామ్‌జీగా మార్చింది.

‘ఉపాధి’ హామీలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల కొరత

కూలీలకు ఇబ్బందులు

పనులు గుర్తింపు, డబ్బు చెల్లింపుల్లో జాప్యం

గుండాల, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతంలో వలసలను నిర్మూలించేందుకు 20 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తెచ్చింది. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును వీబీజీరామ్‌జీగా మార్చింది. అయితే ఆ పథకం పను లు నిర్వహించే కూలీల హాజరు నమోదుకు ప్రతీ పంచాయతీకి ఒక ఫీల్డ్‌ అసి స్టెంట్‌ను నియమించారు. పనులు గుర్తింపుతో పాటు పర్యవేక్షణ, కూలీల హాజరు, పని ప్రదేశంలో వసతులు, సమయానికి వేతనాల చెల్లింపులు తదిత ర పనులు వీరు చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం చిన్న గ్రామాలను, తండాలను నూతన పం చాయతీలుగా ఏర్పాటు చేసింది. ఈ పంచాయతీలకు ఫీల్డ్‌ అసిస్టెంట్లను నియమించకపోవడంతో పథకం నిర్వహణ భారంగా మారింది.

వేధిస్తున్న కొరత

ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని కల్పించాలంటే ఫీల్డ్‌ అసిస్టెంట్ల పాత్ర చాలా ముఖ్యం. పంచాయతీ యూనిట్‌గా పనులు గుర్తించాలి. అయితే జిల్లాలో 421 పంచాయతీలకు 337 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పక్క పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. దీంతో వారిపై పనిభారం పెరిగింది. వేసవిలో వ్యవసాయ పనులు ఉండకపోవడంతో కూలీల హాజరుశాతం ఎక్కువగా ఉంటుంది. పని ప్రదేశంలో కూలీల హాజరును ఫీల్డ్‌ అసిస్టెంట్లు మొబైల్‌ యాప్‌లో నమోదు చేయాలి. కొంత మందికి అదనపు బాధ్యతలు ఉండడంతో ఆన్‌లైన్‌ హాజరు నమోదు ఇబ్బందిగా మారింది. పనులను పర్యవేక్షించి కొలతలు, హాజరు వివరాలు రాసిన మస్టర్లను టీఏలకు సకాలంలో అందిస్తేనే కూలీలకు డబ్బులు వస్తాయి. అయితే ఫీల్డ్‌ అసిస్టెంట్ల కొరత కారణంగా పనుల గుర్తింపుతోపాటు కూలీలకు పనులు కల్పించడం, హాజరు, పని ప్రదేశంలో వసతులు, సమయానికి వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేగాక జాబ్‌కార్డు ఉన్న వారికి 100రోజుల పనులు కల్పించడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

అదనపు బాధ్యతలతో ఇబ్బందులు : కొడపర్తి నవనీత, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, గుండాల

అదనపు బాధ్యతలతో కూలీలకు సకాలంలో పని కల్పించలేక ఇబ్బందు లు పడుతున్నాం. కూలీల ఫొటోలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేయా లి. అదనపు బాధ్యతలతో ఆన్‌లైన్‌ హాజరు నమోదు ఇబ్బందిగా మారింది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేని చోట కొత్తగా నియామకాలు చేపట్టాలి.

జిల్లాలో ఇలా..

పంచాయతీలు 423

ఫీల్డ్‌ అసిస్టెంట్లు 337

జాబ్‌కార్డులు 1,43,090

కూలీలు 2,63,466

ఫీల్డ్‌ అసిస్టెంట్లు 337

Updated Date - Feb 04 , 2026 | 12:50 AM