ఏడాది చివరికల్లా ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:52 AM
ఏడాది చివరికల్లా ఎయిమ్స్ నిర్మాణాలను పూర్తి చేసి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఆయన సందర్శించారు.
కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
బీబీనగర్ ఎయిమ్స్ పురోగతిపై కేంద్ర మంత్రి సమీక్ష
బీబీనగర్, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఏడాది చివరికల్లా ఎయిమ్స్ నిర్మాణాలను పూర్తి చేసి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఆయన సందర్శించారు. డైరెక్టర్ అమిత అగర్వాల్‌తోపాటు వివిధ విభా గ అధిపతులతో కలిసి ఎమర్జెన్సీ బ్లాక్‌లో అత్యవసర సేవల విభాగాలను పరిశీలించారు. అనంతరం ఎయి మ్స్ పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి విలేకరులతో మా ట్లాడుతూ 201 ఎకరాల్లో రూ.1,110 కోట్లతో 750 పడకల సామర్థ్యంతో ఎయిమ్స్ నిర్మాణం కాబోతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ.832 కోట్లు ఖర్చు చేసి 86 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఓ పక్కన నిర్మాణం, మరోపక్క ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రోజుకు 1800 నుంచి 2వేల మంది రోగులు వైద్యం కోసం ఎయిమ్స్‌కు వస్తున్నారన్నారు. ఆసుపత్రిని ప్రారంభించినప్పటినుంచి ఇప్పటి వరకు 15లక్షల మందికి వైద్య సేవలు అందించినట్లు చెప్పా రు. 2019-20, 2020-21లలో రెండు ఎంబీబీఎస్ బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు వైద్య విద్యను పూర్తి చేసుకు ని వైద్యులుగా పట్టా పొంది బయటకు వెళ్లినట్లు చెప్పారు. బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్‌సహా మొత్తం 800 మంది వైద్య విద్యతోపాటు వైద్య శిక్షణ పొందుతున్నారన్నారు. ఇప్పటికే 200బెడ్లతో వైద్య సేవ లు కొనసాగుతుండగా, జనవరి 1నుంచి అత్యవసర సేవలు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలు, వసతి సదుపాయాలతో ప్రపంచస్థాయి వైద్య సేవలు ఎయిమ్స్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు. గ్రామీణ పట్టణ ప్రజల కు మెరుగైన అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఎయిమ్స్ నిర్మాణమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిమ్స్ పాత భవనాల్లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయడంవల్ల, పాత భవనాలను ఎయిమ్స్‌కు తగినట్లు ఆధునీకరణ చేస్తుండడం వల్ల ఆలస్యమవుతుందన్నారు. సాధ్యమైనంత తొందరలో అసంపూర్తి పనులు పూర్తి చేయించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఎయిమ్స్‌ను ప్రారంభిస్తామన్నారు.
బీబీనగర్ రైల్వేస్టేషన్‌లో అన్ని ప్యాసింజర్ రైళ్లను ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని, దాంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాలనుంచి రోగులు రావడానికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అలాగే ఓఆర్‌ఆర్ కు అనుబంధంగా నిర్మించబోతున్న త్రిపుల్ ఆర్ పూర్తయితే తెలంగాణలోని అన్నిజిల్లాల ప్రజలు వైద్యం కోసం ఎయిమ్స్‌కు రావడానికి రోడ్డు రవాణా సదుపాయాలు మరింత మెరుగవుతాయన్నారు. ఇప్పటికే నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలనుంచి రోగులు ఎయిమ్స్‌కు వస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఎయి మ్స్ ప్రాంగణంలో కేంద్ర మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు బూర నర్సయ్యగౌడ్, గూడూరు నారాయణరెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ అమిత అగర్వాల్, లక్కిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, పాశం భాస్కర్, వేముల అశోక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.