ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:39 AM
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు 2026-28 సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి ఈ నెల 28తో ము గుస్తుందని, కొత్తకార్డులకోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన జర్నలిస్టులకు జారీ చేయనున్నట్లు తెలిపా రు.
కలెక్టర్ హనుమంతరావు
యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం యాదగిరిగుట్టలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఓటుహక్కు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని అన్నారు. ఓటర్లు డబ్బులు, మద్యం, ఇతర కానుకలకు ప్రలోభ పడవద్దన్నారు. మీ వార్డులలో ఓటుని అమ్ముకోమని, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అంతకు ముందు మునిసిపల్ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా విద్యార్థులు, అధికారులు కలిసి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో నాగిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ మిర్యాల లింగస్వామి, తహసీల్దార్ గణే్‌షనాయక్, ఎంపీడీవో నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరి (కలెక్టరేట్): జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు 2026-28 సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి ఈ నెల 28తో ము గుస్తుందని, కొత్తకార్డులకోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన జర్నలిస్టులకు జారీ చేయనున్నట్లు తెలిపా రు. జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం సంబంధి త మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌర సంభందాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పే ర్లు వచ్చిన జర్నలిస్టులు ఈ నెల 9 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి
మునిసిపల్ ఎన్నికల విధులను నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 8, 9 తేదీల్లో ఆయా మునిసిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్‌కేంద్రాలు భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, భూదాన్ భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరులలో తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు.
భువనగిరి టౌన్: మునిసిపల్ ఓట్ల లక్కింపు కేం ద్రంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు, భద్రత కల్పిస్తున్నట్టు కలెక్టర్, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. భువనగిరి పట్టణ శివారులోని దివ్యబాల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని వారు పరిశీలించి చే యాల్సిన ఏర్పాట్లు కల్పించాల్సిన భద్రతను సమీక్షించి మాట్లాడారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల 102 వార్డుల ఓట్ల లెక్కింపు 13న జరుగుతుందని , ఈమేరకు ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సీసీకెమెరాల నిఘాలో లెక్కింపు జరుగుతుందని, అందుకు అనుగుణంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, మునిసిపల్ కమిషనర్ జి రామలింగం, తహసీల్దార్ అంజిరెడ్డి, మేనేజర్ నరేశ్ రెడ్డి, డీఈ కొండల్ రావు పాల్గొన్నారు.