fighting: సమరానికి సై
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:48 AM
మునిసిపల్ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులెవరో ఖరారయ్యారు. మంగళవారం నామినేష న్ల ఉపసంహరణ గడువు ముగిశాక, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు ఇక పూర్తిస్థాయిలో ప్రచార క్షేత్రంలోకి దిగనున్నారు.
ఆరు మునిసిపాలిటీల్లో బరిలో 353 మంది
కాంగ్రెస్ ఖాతాలో రెండు వార్డులు ఏకగ్రీవం
జిల్లాలో నాటకీయ పరిణామాలు
యాదగిరిగుట్టలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్ధి ఏకగ్రీవం
చౌటుప్పల్‌లో 17వ వార్డు అభ్యర్థి సైతం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): మునిసిపల్ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులెవరో ఖరారయ్యారు. మంగళవారం నామినేష న్ల ఉపసంహరణ గడువు ముగిశాక, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు ఇక పూర్తిస్థాయిలో ప్రచార క్షేత్రంలోకి దిగనున్నారు.
జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లోని 104 వార్డుల కు రెండు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 102 వార్డుల్లో 353 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఓ వైపు సీట్ల సర్దుబాటు, మరోవైపు ఆశావహులకు బుజ్జగింపులతో మంగళవారం సాయంత్రం ఉపసంహరణ ల గడువు ముగిసే వరకు చర్చోపచర్చలు, టికెట్ దక్కని వారిని బుజ్జగించి దాదాపుగా ఒకటి, రెండు వార్డులు మినహా రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు పడ్డారు. ఆయా పార్టీలు గెలుపు గుర్రాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇతర ఆశావహులను సర్దుబాటు చేసేందుకు నానా తంటాలు పడ్డారు.
102 వార్డులకు 353 మంది అభ్యర్థులు
జిల్లాలోని 102 వార్డులకు 347 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యాదగిరిగుట్టలో 10వ వార్డులో కాంగ్రె్‌సకు చెందిన గుండ్లపల్లి వాణిభరత్‌గౌడ్, చౌటుప్పల్ మునిసిపాలిటీలో 17 వార్డుకు చెంది న చింతల మహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉపసంహరణల ఘట్టం ముగిసిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. పార్టీ అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు, స్వతంత్రులకు మాత్రం ఎన్నికల సంఘం విడుదలచేసిన గుర్తులను కేటాయించారు.
నాటకీయ పరిణామాల నడుమ ఉపసంహరణలు
నామినేషన్ల ఉపసంహరణల గడువు చివరి నిమిషంలో జిల్లాలోని రెండు మునిసిపాలిటీల్లో నాటకీయ పరిణామాల నడుమ ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదగిరిగుట్ట మునిసిపల్ కాంగ్రెస్ చైర్మెన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణిభరత్‌గౌడ్, చౌటుప్పల్ మునిసిపాలిటీలో 17వ వార్డు నుంచి ఇతర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో చింతల ఉమామహేశ్వరి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో కాంగ్రెస్ నుంచి చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి వాణిభరత్‌గౌడ్‌ను 10వ వార్డు నుంచి పోటీకి నిలుపగా, ఆమెపై బలమైన అభ్యర్థినిగా ఆవుల మమతసాయిని బీఆర్‌ఎస్ పోటీకి దింపింది. అయితే బీఆర్‌ఎస్ అభ్యర్థిని మమతసాయి నామినేషన్ల ఉపసంహరణ గడువుకు కొద్ది నిమిషాల ముందే నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ వార్డుకు ఒక్కరే అభ్యర్థి మిగలడంతో కాంగ్రెస్ నుంచి మునిసిపల్ చైర్మన్‌గా ప్రకటించిన గుండ్లపల్లి వాణిభరత్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీని వెనుక ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చక్రం తిప్పినట్టు చర్చ జరుగుతోంది. అయితే తమ అభ్యర్థిని లక్షల రూపాయలతో ప్రలోభపెట్టి, అప్రజాస్వామికంగా ఉపసంహరింపజేశారని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను నిరసిస్తూ పట్టణంలో నిరసన ప్రదర్శన, దిష్టిబొమ్మ దహనం చేశారు.
రెండు పార్టీల నుంచి నామినేషన్ వేసి..
చౌటుప్పల్ మునిసిపాలిటీలో ఒకే అభ్యర్థి రెండు పార్టీల నుంచి నామినేషన్ వేసి, ఉపసంహరణ చివరి నిమిషంలో బీ-ఫాం ఇచ్చిన పార్టీని కాదని, మరో పార్టీ బీ-ఫాం సమర్పించి నాటకీయ పరిణామం నడు మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్ 17వ వార్డులో చింతల ఉమా మహేశ్వరి ఉత్కంఠత నడుమ ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. 17వ వార్డు కాం గ్రెస్ అభ్యర్థి త్వం కోసం చింతల ఉమామహేశ్వరి, పత్తం మల్లమ్మ పోటీపడ్డా రు. అయితే చింతల ఉమామహేశ్వరి ముందు జాగ్రత్తగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అయితే మంగళవారం నామినేషన్ల చివరి గడువున బీఆర్‌ఎస్ ఆమెకు బీ-ఫాం ఇచ్చింది. అయితే అం తకుముందే కాంగ్రెస్ నాయకుల ఒప్పందం ప్రకారం చివరి నిమిషంలో కాంగ్రెస్ బీ- ఫాం అందజేసింది. అ యితే తొలుత బీఆర్‌ఎస్‌ఇచ్చిన బీ-ఫాంను అధికారులకు అందజేయలేదు. ఈ లోగా కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన మరో అభ్యర్థిని పస్తం మల్లమ్మను ఉపసంహరింపజేశారు. దీంతో బరిలో ఉమామహేశ్వరి ఒక్కరే మిగిలి 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమామహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నాటకీయ పరిణామాల నడుమ జిల్లాలో ఇద్దరు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే చౌటుప్పల్ మునిసిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
చౌటుప్పల్ ఏకగ్రీవ ఎన్నికపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు
చౌటుప్పల్ మునిసిపాలిటీలోని 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల పరమేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- మిగతా 6వ పేజీలో...
మునిసిపాలిటీ వార్డులు అభ్యర్థులు
భువనగిరి 35 128
చౌటుప్పల్ 20 58
పోచంపల్లి 13 40
మోత్కూరు 12 49
యాదగిరిగుట్ట 12 38
ఆలేరు 12 40