నార్కట్‌పల్లి, అక్టోబరు 23,(ఆంధ్రజ్యోతి) :సీసీఐ నిబంధనల మేరకు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు మద్దతు ధర పొందాలని పత్తి కొనుగోలు జిల్లా ఇనచార్జి, రాష్ట్ర పశుసంవర్థక, వ్యవసాయ శాఖ సంచాలకుడు బీ.గోపి సూచించారు.
రైతులు అన్నిరకాల జీవాల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని, పశువులు ఆరోగ్యంగా ఉంటే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారని పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ కిషనకుమార్ అన్నారు.
పులిచింతల ప్రాజెక్టు పునరావాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు ప్రాంతాలైన మట్టపల్లి, సుల్తానపురం, గుండ్లపల్లి గ్రామాల నిర్వాసితుల కోసం పునరావాసాలు ఏర్పాటు చేశారు.
విద్యార్థులు తెలుగు కూడా చదవలేరా అంటూ కలెక్టర్ తేజ్‌సనందలాల్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మాధవరం గ్రామంలోని మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాల, అంగనవాడీ కేంద్రాలను ఆయన తనిఖీచేశారు.
మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. మొదటి నోటిఫికేషనలో ఈ నెల 18వ తేదీతో దరఖాస్తుకు అవకాశం ముగియగా, వ్యాపారుల నుంచి పెద్దగా దరఖాస్తులు రాకపోవడంతో ఈ నెల 23వ తేదీ వరకు గడువు పెంచారు.
మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో అసంపూర్తిగా ఆగిపోయిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులు పూర్తిచేసి, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేశారు.
ఎంఎ్‌సఎంఈ పథకాలపై చేనేత కళాకారులు అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భూదానపోచంపల్లి హస్తకళ వీవర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ చిక్క కృష్ణ కోరారు.
రాజాపేట మండలంలోని పాముకుంట-మొల్లగూడెం బీ టీ రోడ్డు పనులు నత్తకు నడకను నేర్పుతున్నాయి.
అధికవడ్డీకి ఆశపడి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలానికి చెందిన రమావత బాలాజీనాయక్, మధునాయక్ ఉదంతంలో ఏజెంట్లలో అలజడి మొదలైంది. వడ్డీ విషయం బయటకు చెప్పవద్దని, చెబితే డబ్బులు రావని ద్వితీయశ్రేణి ఏజెంట్లు బాధితులను బెదిరించేవారు. దీంతో బాధితులు వెనుకడుగు వేశారు.
రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆర్టీఏ చెక్‌పోస్టులను బుధవారం నుంచి మూసివేశారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని 15 చెక్‌పోస్టులను మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీ