టీచర్‌గా మారి.. పాఠాలు బోధించి
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:47 AM
టీచర్‌గా మారి.. పాఠాలు బోధించా రు కలెక్టర్ చంద్రశేఖర్. ఆల్ఫాబెటిక్ నెంబర్లను, బొమ్మలను చూపిస్తూ కలెక్టర్ చంద్రశేఖర్ చిన్నారులతో సరదాగా గడిపారు. మండలంలోని సరంపేట గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సోమవా రం తనిఖీ చేశారు.
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో సరదాగా గడిపిన కలెక్టర్
మర్రిగూడ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): టీచర్‌గా మారి.. పాఠాలు బోధించా రు కలెక్టర్ చంద్రశేఖర్. ఆల్ఫాబెటిక్ నెంబర్లను, బొమ్మలను చూపిస్తూ కలెక్టర్ చంద్రశేఖర్ చిన్నారులతో సరదాగా గడిపారు. మండలంలోని సరంపేట గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సోమవా రం తనిఖీ చేశారు. చిన్నారులకు ప్రతిరోజూ అందిస్తున్న గుడ్లు, పప్పుదినుసులను ఇతర వస్తువులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతిరోజూ చిన్నారులకు అందిస్తున్న మెనూ పట్టిక లేకపోవడంతో అంగన్వాడి టీచర్ కళమ్మను ప్రశ్నించారు. చిన్నారుల కు అందించే పోషక పదార్థాలపై నిర్లక్ష్యం చే యవద్దని సూచించారు. గర్భిణులకు పోషక ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారా?, గుడ్లు ఏసైజులో వస్తున్నాయని సీడీపీవోలు లావణ్య దేవి, సక్కుబాయిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలో విద్యను అభ్యసిస్తున్న చిన్నారులతో ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నలు వేస్తూ చిన్నారులు చెప్పిన సమాధానాలకు నవ్వుతూ కాసేపు సరదాగా గడిపారు. ఈయన వెంట తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, ఎంపీవో రవికుమార్, సూపర్‌వైజర్ వైష్ణవి, పాండురంగారెడ్డి, సర్పంచ్ నక్క రాములమ్మ, రవి, ఫీల్డ్ అసిస్టెంట్ దుబ్బ రవి,వార్డు మెంబర్ నక్క వెం కట్, వరకాల వెంకటేష్, నరసింహ ఉన్నారు.
డిస్ర్టిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్
చండూరు : మునిసిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం చండూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్ సెంటర్‌ను సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్, చండూరు ఆర్డీవోతో కలిసి పరిశీలించారు. డిస్ర్టిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు. ఆయన వెంట మునిసిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం, తహసీల్దార్ రమాకాంత్, ఎంపీడీవో యాదగిరి ఉన్నారు.
చివరి ర్యాండమైజేషన్
నల్లగొండ రూరల్: మునిసిపల్ ఎన్నికల పోటింగ్ పై జిల్లా సాధరణ పరిశీలకుడు రాష్ట్ర ఎస్‌సీఈఆర్టీ సంచాకలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ బి చంద్రశేఖర్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11న మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, నందికొండ, హలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల మునిసిపల్ కేంద్రాల్లో 475 పోలింగ్ కేంద్రాల్లో 20శాతం రిజర్వ్ కలుపు కొని పోలింగ్ సిబ్బందిని కేటాయిస్తూ ర్యాండమైజేషన్ పూర్తి అయినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.