మునిసిపల్ పోరుకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:13 AM
చౌటుప్పల్ టౌన, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మునిసిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
చౌటుప్పల్ టౌన, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మునిసిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చౌటుప్పల్ 19 వార్డులకు గాను 38 పోలింగ్ బూతను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహ ణకు ఎన్నికల అధికారి వెంకట్రామ్ రెడ్డి పర్యవేక్షణలో ఏడుగురు జోనల్ అధికారులు, 191 మంది పీవో, ఏపీ వో లను నియమించారు. డీఎస్పీ మధుసూదన రెడ్డి పర్యవేక్షణలో 135 మంది పోలీ్‌సలతో బందోబస్తు ను ఏర్పాటు చేశారు.
500 మంది పోలీ్‌సలతో బందోబస్తు
చౌటుప్పల్ పోలీస్ సబ్ డివిజన లోని చౌటుప్పల్, భూదాన పోచంపల్లి, మోత్కూర్ మునిసిపాలిటీల ఎన్నికలకు 500 మంది పోలీ్‌సలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ మధుసూదన రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో ఆరు, భూదాన పోచంపల్లిలో నాలుగు, మోత్కూర్ లో రెండు మొ బైల్ పార్టీలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక, అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించామని, మద్యం రవాణాను అరికట్టేందుకు పెట్రోలింగ్ పార్టీలు 24 గంటలు తిరుగుతాయని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనలను దిక్కరించిన, పోలింగ్‌కు ఆటంకం కలిగించిన కఠినంగా వ్యవహరిస్తామని, పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎనఎ్‌సఎ్‌స అమలులో ఉందని డీఎస్పీ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపల ఎన్నికల ప్రచారం చేయకూడదని, ఓటర్లు ఓటు వేసిన వెంటనే బయటకు వెళ్లిపోవాలని ఆయన అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. డీఎస్పీ వెంట చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ ఉన్నారు. చౌటుప్పల్ మునిసిపాలిటీలో 19 వార్డులకు నేడు జరగనున్న ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 20 వార్డులు ఉండగా అందులో 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల ఉమా మహేశ్వరి ఎన్నిక ఏకగ్రీవం కాగా 19 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఎం మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. కాంగ్రె్‌సకు సీపీఐ మద్దతు ప్రకటించింది. మొత్తం 27,216 మంది ఓటర్లు ఉన్నారు.
మోత్కూరులో..
మోత్కూరు : మోత్కూరు మునిసిపాలిటీలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మునిసిపల్ కమిషనర్ కె.సతీ్‌షకుమార్ తెలిపారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. మోత్కూరు మునిసిపాలిటీలో 12 వార్డులు ఉండగా 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 26 మంది పోలింగ్ అధికారులు, 26 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, ఆరుగురి చొప్పున పీవో, ఏపీవో లు రిజర్వులో, 64 మంది ఓపీవోలు పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. 8 మంది మైక్రో అబ్జర్వర్లు, ఇద్ద రు జోనల్ అధికారులు, రెండు మొబైల్ టీంలు ఏర్పా టు చేశారు. మోత్కూరు మునిసిపాలిటీలో 12 వార్డులకు 49 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
యాదిగిరిగుట్టలో..
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట ముని సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ డీఆర్‌డీవో నాగిరెడ్డి తెలిపారు. 11 వార్డులకు గాను 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలింగ్ నిర్వహణకు ఆర్‌వో, ఏఆర్‌వో, ఏపీవోలు, ఓపీవోలు, పోలింగ్ పర్సన్స్ మొత్తం సిబ్బంది సుమారు 230 మంది పాల్గొననున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో పాటుగా బ్యాలెట్ బాక్స్‌లు తరలించినట్లు చెప్పారు. ఆయనతో పాటుగా గుట్ట మునిసిపల్ కమిషనర్ లింగస్వామి, తహసీల్దార్ గణే్‌షనాయక్, ఎంపీడీవో నవీన్‌కుమార్ ఉన్నా రు. కాగా ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పా టు చేసినట్లు యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివా్‌సనాయుడు తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 48మంది మెన్ సిబ్బంది, 27మంది ఆర్ముడ్ పోలీస్ మొత్తం 90 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఆయనతో పాటుగా సీఐలు బొడ్డుపల్లి భాస్కర్, మాదాను శంకర్‌గౌడ్ ఉన్నారు.
ఆలేరులో..
ఫ ఆలేరు : ఆలేరు మునిసిపాలిటీ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేదుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మునిసిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు సామగ్రి పంపిణీ చేసి మాట్లాడారు. మున్సిపాలిటీలోని 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి వార్డుకు ఒక ప్రిసై డింగ్ ఆఫీసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇద్దరు ఓపీవోలు, మరోఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను నియమించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి మున్సిపాలిటీ కమిషనర్ కె. శ్రీనివాసరెడ్డి, రిటర్నింగ్ ఆఫీసర్లు ఆంజనేయులు, సత్యాంజనేయ ప్రసాద్, అనురాధ, హేమంతకుమార్, ఏఆర్వోలు దూడల వెంకటేశ తిరుపతిరెడ్డి, ఉమాశంకర్, సత్తిరెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.