Share News

ప్రచారం నేటితో బంద్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:35 AM

పురపాలక సంఘాల్లో ప్రాతినిధ్యానికి అభ్యర్థులు.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో మరికొందరు.. ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న మునిసిప ల్‌ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరింది.

ప్రచారం నేటితో బంద్‌

తుది దశకు పురపాలక ఎన్నికల ప్రక్రియ

ఓటుకు ఎంతివ్వాలని అభ్యర్థుల అంతర్మథనం

వలస ఓటర్లతో పాటు కుల సంఘాలు, పెద్ద కుటుంబాలతో సమాలోచనలు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): పురపాలక సంఘాల్లో ప్రాతినిధ్యానికి అభ్యర్థులు.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో మరికొందరు.. ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న మునిసిప ల్‌ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరింది. సోమవారం సాయంత్రానికి ఎన్నికల ప్రచా రం ముగియనుండటంతో ఓట్లను రా బట్టుకుని, విజయతీరం చేరేందుకు పోల్‌ మేనేజ్‌మెంట్‌కు తెరవెనుక వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. అదేవిధంగా ఓటుకు నోటు ఎంత ఇవ్వాలనే దానిపై అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు.

అందుకోసం కుల సంఘాలు, ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న ఉమ్మడి కుటుంబాలతో సమాలోచనలు చేస్తున్నారు. అదే విధంగా ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన ఓటర్లను రప్పించి ఓటు వేయించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యా రు. వీటన్నింటికంటే ఓటుకు నగదు పంపిణీ కి అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో బిజీగా ఉన్నారు. ప్రత్యర్థి ఓటుకు ఎం త నగదు ఇస్తాడు? తామెంత ఇవ్వాలనే? దానిపై అంతర్మథనం చెందుతున్నారు.

ప్రచారానికి తెర

జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలోని 104 వార్డుల్లో రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 102 వార్డుల్లో 353 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు వారం రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం సాగించారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు చెందిన అభ్యర్థులు 99 మంది, బీఆర్‌ఎ్‌సకు చెందిన 90మంది, బీజేపీకి చెందిన 92మంది, సీపీఎంకు చెందిన 8మంది, బీఎస్పీ నుంచి ఐదుగురు, సీపీఐ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఐదుగురు, ఇతరులు ముగ్గురు, స్వతంత్రులు 47 మంది పోటీపడుతున్నారు. ఎన్నికల్లో విజయం కోసం హోరాహోరీగా సాగిన ప్రచారంలో ప్రచా ర రథాలు, మైకుల్లో ప్రత్యేక గీతాలతో హోరెత్తించారు. ప్రధాన పార్టీలో ముఖ్యనాయకులు ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం సాగించారు. కాంగ్రెస్‌ నుంచి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కతో పాటు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభు త్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ్రు శోభారాణి ముమ్మరంగా ప్రచా రం చేశారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్‌, గాదరి కిషోర్‌కుమార్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, తదితరులు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు జి.మనోహర్‌రెడ్డి, వేముల అశోక్‌, తదితర నేతలు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలు

జిల్లాలోని ఆరు మునిసిపల్‌ వార్డుల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రధాన పార్టీలతో పాటు బలమైన ఇండిపెండెంట్లు సోమవారం సాయంత్రానికి ప్రచారం ముగియనుండటంతో పోల్‌ మేనేజ్‌మెంట్‌ యత్నాల్లో తలమునకలయ్యారు. ఓట్లు రాబట్టుకోవడానికి వజ్రాయుధంగా మారిన నగదు పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్టీ ఏదైనా, అభ్యర్థి ఎంత సమర్థుడైనా ఓటుకు ఎంత ఇస్తున్నారనేదే గెలుపుకు గీటు రాయిగా మారడంతో ఆ దిశగా నిధులు సమకూర్చుకుంటున్నారు. జిల్లాలోని యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, భువనగిరి మునిసిపాలిటీల్లో ఓటుకు పెద్దమొత్తంలో నగదు పంపిణీ జరుగుతుందనే ప్రచారంలో ఉంది. యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌ మునిసిపాలిటీల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ఓటర్లకు ముట్టచెప్పడానికి అభ్యర్థులు సిద్ధమైనట్టు తెలుస్తోం ది. ఆలేరు, మోత్కూరు వంటి మునిసిపాలిటీల్లో సైతం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేసే అవకాశం ఉందని సమాచారం. వీటికి తోడు ప్రతీ రోజులాగే మద్యం, మాంసం వంటివి ప్రత్యేకమేనని చెబుతున్నారు. అందు కోసం ఆర్థిక స్థోమత ఉన్న అభ్యర్థులు అవసరమైన నిధులను సమకూర్చుకుని పంపిణీకి సిద్ధంగా ఉండగా, స్థోమత లేని అభ్యర్థులు అధిక వడ్డీతో అప్పు చేస్తున్నారు. ఈ అప్పుల కోసం ప్లాట్లు, వ్యవసాయ భూములను తాకట్టుపెట్టడమేగాక, నమ్మకం లేనిచోట ఏకంగా ముందస్తు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు.

వలస ఓటర్లు, ఉమ్మడి కుటుంబాలపై దృష్టి

మునిసిపల్‌ ఎన్నికల్లో సగటున ఒక్కో వా ర్డుకు 1,300 నుంచి 1,400 వరకే ఓట్లు ఉండటంతో కొద్ది వ్యత్యాసమే గెలుపోటములను ప్ర భావితం చేయనుంది. దీంతో అభ్యర్థులు ప్రతీ ఓటును కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయా వార్డుల్లో కుల సంఘాలు, ఉమ్మడి కుటుంబంగా పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్న వా రిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా కానుకలను ఆఫర్‌ చేయడ మే కాకుండా సమస్యల పరిష్కారంలో అందుబాటులో ఉం టామని నచ్చచెబుతున్నారు. ఇక ఆయా వా ర్డుల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన వా రిని సంప్రదిస్తున్నారు. పోలింగ్‌ రోజు న రప్పించడానికి అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించడమే కాకుండా కానుకలు, నగదును అందించడానికి ప్రత్యేక శ్రద్ధపెట్టారు. ప్రతీ మునిసిపల్‌లోని వార్డులో 50 నుంచి 100 ఓట్లు ఇతర పట్టణాలు, నగరాల్లో నివసించే ఓటర్లవే ఉన్నాయి. ఈ ఓటర్లను ఎవరు పో లి ంగ్‌ రప్పిస్తే వారికే అనుకూలంగా ఉంటుందనే భావనతో ప్రత్యేకంగా వాహనాలు, వ్యక్తులను ఏర్పాటు చేసి వారు వచ్చి ఓటు వేసే విధంగా ముందస్తుగానే సంప్రదించి ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:35 AM