Share News

మూతపడనున్న మద్యం దుకాణాలు

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:37 AM

మునిసిపల్‌ ఎన్నిక ల నేపథ్యంలో నేటినుంచి ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసివేస్తామని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం.విష్ణుమూర్తి తెలిపారు. ఆదివారం మద్యం దుకాణాల మూసివేతపై ఆయన వివరాలు వెల్లడించారు.

మూతపడనున్న మద్యం దుకాణాలు

జిల్లా ఎక్సైజ్‌ అధికారి విష్ణుమూర్తి

భువనగిరిటౌన్‌, భువనగిరి (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నిక ల నేపథ్యంలో నేటినుంచి ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసివేస్తామని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం.విష్ణుమూర్తి తెలిపారు. ఆదివారం మద్యం దుకాణాల మూసివేతపై ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆదేశాలతో మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్న పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, గుట్ట,భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌, మోత్కూ రు మునిసిపాలీటీల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు నేటి సాయంత్రం 5గంటలనుంచి ఈనెల 11న జరిగే పోలింగ్‌ముగిసే వరకూ కొ నసాగనుందన్నారు. అదేవిధంగా ఈ నెల 13న ఓట్ల లెక్కింపు రోజు కూడా పూర్తిగా మూసివేయబడుతాయని, మద్యం దుకాణాలతోపాటు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు కూడా మూసివేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:37 AM