Share News

ఇక పంపకాలే!

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:45 AM

ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రచార ఘట్టం ముగిసి, కీలకమైన పోల్‌ మేనేజ్‌మెంట్‌ పర్వం మొదలైంది. అధికార, ప్రతిపక్షాల నడుమ హోరాహోరీగా ఎన్ని క జరుగుతుండడంతో ప్రతీ ఓటును రాబట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు ప్రయత్నిస్తున్నా రు.

ఇక పంపకాలే!

చోటా లీడర్లకు బంపర్‌ ఆఫర్లు

గంపగుత్తగా ఓట్ల కొనుగోళ్లు

మొదలైన తాయిలాల పంపిణీ

మద్యం పంపిణీకి సిద్ధం

వార్డుల్లో జోరుగా సాగుతున్న విందులు, పార్టీలు

ఓటుకు రూ.1,500 నుంచి రూ.6వేల వరకు పంపిణీకి సన్నాహాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రచార ఘట్టం ముగిసి, కీలకమైన పోల్‌ మేనేజ్‌మెంట్‌ పర్వం మొదలైంది. అధికార, ప్రతిపక్షాల నడుమ హోరాహోరీగా ఎన్ని క జరుగుతుండడంతో ప్రతీ ఓటును రాబట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు ప్రయత్నిస్తున్నా రు. ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు తాయిలాల పంపిణీ ప్రారంభించారు. బలమై న పోటీ ఉన్నచోట ఒకతీరు, నామమాత్ర పు పోటీ ఉన్నచోట్ల మరోతీరుగా నగదు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారికంగా ప్రచారం సోమవారం సాయంత్రానికే ముగిసినప్పటికీ వార్డుల్లో విచ్చలవిడిగా మద్యం, నగదు, మాంసం, తాయిలాల పంపకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

పోలింగ్‌కు గడువు సమీపిస్తుండడంతో గెలుపునకు ఎంతదూరంలో ఉన్నామో అంచనా వేసుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు ఆయా వార్డుల్లో అభ్యర్థుల గెలుపుకు అవసరమైన ఓట్లను సమీకరించేందుకు తుది ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా వార్డుల్లో ఎక్కువ ఓట్లున్న కుటుంబాల పెద్దలను నేరుగా కలిసి ఓట్లేస్తే ఏం కావాలో అది చేస్తామని హామీ పత్రాలివ్వడమేగాక, నగదు ఎంతడిగితే అంత ఇస్తూ మాట తీసుకుంటున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలో, బరిలో ఉన్న మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తారని భావిస్తున్న అభ్యర్థుల తరపున బలంగా పనిచేస్తున్న కార్యకర్తలు,వారికి అండగా ఉండే ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు, చర్చలు ప్రారంభించారు. ఓటర్లకు ఇచ్చే తాయిలాలు యథావిధిగా ఇస్తూ, వారిని తమవైపునకు తిప్పి ఓట్లేయిస్తే సదరు ఛోటా లీడర్లకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు నగదు, కార్లు బహుమానాలుగా ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. కొన్ని చోట్ల ఇళ్లస్థలాలను ఛోటా లీడర్లకు ఎరవేసినట్టు చెబుతున్నారు. గతానికి భిన్నంగా హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో కీలకమైన మునిసిపాలిటీల్లో వీరికి డిమాండ్‌ పెరిగినట్లు చెబుతున్నారు.

డంపులకు చేరిన మద్యం

ప్రచార పర్వం మొదలయినప్పటి నుంచి మద్యం ఇప్పటికే రెండు పర్యాయాల చొప్పున అందజేశారు. సోమవారం సాయంత్రం నుంచి వైన్స్‌ దుకాణాలు బంద్‌ అయిన్పటికీ సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి ఓటర్లకు పంపిణీ చేసే నిమిత్తం అవసరమైన మద్యాన్ని అభ్యర్థులు వారికి నమ్మకమైన రహస్య స్థావరాలకు తరలించారు. వైన్స్‌దుకాణాల నిర్వాహకుల ద్వారా ఇప్పటికే మద్యం సేకరించి పెట్టుకున్నారు. మంగళవారం రాత్రి సైతం పెద్ద మొత్తంలో ఓటర్లకు మద్యం అందించనున్నట్లు చెబుతున్నారు. ఓటరుకు క్వార్టర్‌ విస్కీ లేదా బీరు, మహిళలకు సాఫ్ట్‌ డ్రింకులు అందించాలని నిర్ణయించారు.

జోరుగా విందులు, చీరలు, మాంసం పంపిణీ

ప్రతి ఓటును కీలకంగా భావిస్తుండడం తో ఈ ఎన్నికల్లో రకరకాల తాయిలాలు ఓటర్లకు అందజేస్తున్నారు. నగదు పంపిణీ కి ఓ వైపు ఏర్పాట్లు చేసుకుంటున్న అభ్యర్థు లు మరోవైపు మహిళలకు వార్డుల్లో పట్టుచీరలను అందజేస్తున్నారు. నల్లగొండ కార్పొరేషన్‌, మిర్యాలగూడ, హాలియా, చండూ రు, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, భువనగిరి మునిసిపాలిటీల్లో ఈ పంపకాలు ఉధృతంగా సాగుతున్నాయి. పోటాపోటీ ఉన్నచోట, చైర్మన్‌ అభ్యర్థిత్వానికి పోటీప డే అభ్యర్థులు ఉన్న వార్డుల్లో ఈ పంపకాల జోరు ఎక్కువగా ఉంది. కొ న్ని వార్డుల్లో మహిళలకు కుంకుమ భరిణెలను అందజేస్తున్నారు. వార్డుల్లో, గల్లీల్లో విందుభోజనాలు ఏర్పాటు చేస్తే, కొన్ని చోట్ల బాస్మతి బియ్యం, కిలో చికెన్‌, మద్యం సీసాలను అందజేశారు. మరికొన్ని వార్డుల్లో ఇం టి సరుకుల బ్యాగులను, కూరగాయల బా స్కెట్లను, కాజుమిఠాయి ప్యాకెట్లను ఓటర ్లకు అందజేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఒక పార్టీ వారు ఒ క తాయిలం ఇచ్చిన వెంటనే ఇంకో పార్టీ వారు అంతకంటే మిన్నగా తాయిలాలు ఇస్తున్న పరిస్థితి ఉంది.

ఓటుకు రూ.1500 నుంచి..

వార్డుల్లో గెలుపే లక్ష్యంగా ఈ సారి నగ దు పంపిణీ భారీగా చేసేందుకు అభ్యర్థులు, ప్రధాన పార్టీలు సన్నాహాలు చేసుకున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటాపోటీ ఉన్న చోట్ల ఓటుకు రూ.6వేల వరకు పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. చండూరు, మిర్యాలగూడ, యాదగిరిగుట్ట మునిసిపాలిటీల్లోని కొన్ని వార్డుల్లో అత్యధికంగా ఓటుకు రూ.6 వేల వరకు ఇచ్చేందుకు ఇరు పార్టీలు సిద్ధమైనట్లు చర్చసాగుతోంది. నామమాత్రపు పోటీ ఉన్న వార్డుల్లోనూ ఓటుకు రూ.1500 నుంచి రూ.2వేలవరకు ఇస్తుండగా, ఎక్కువ వార్డుల్లో రూ.2వేల వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధానంగా పోటాపోటీ ఉన్నచోట్ల నగదు పంపిణీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నగదు పంపిణీకి సంబంధించి వారికి అనుకూలమైన వ్యక్తుల వద్దకు నగదు చేరవేసిన అభ్యర్థులు, ప్రధాన పార్టీల నేతలు మంగళవారం సాయంత్రం నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నేరుగా నగదు అందజేయాలని నిర్ణయించారు.

Updated Date - Feb 10 , 2026 | 12:47 AM