Share News

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:41 AM

రాజకీయాలకు అతీతంగా జిల్లాను అబివృద్ధి చేస్తానని పౌరసరఫరాల, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎంజీరోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

కాంగ్రెస్‌ అంటేనే సామాజిక న్యాయం

కార్యకర్తల కృషితోనే కాంగ్రె్‌సకు అధికారం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా జిల్లాను అబివృద్ధి చేస్తానని పౌరసరఫరాల, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎంజీరోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ అంటేనే సామాజిక న్యాయానికి చిరునామా అని స్పష్టం చేశారు. కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, వారి కష్టాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఆదుకుంటామన్నారు. గతంలో పేదలకు దొడ్డు బియ్యం పంపిణీచేస్తే అడ్డదారిపట్టేదని, ప్రస్తుతం కాం గ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్నబియ్యంతో వారి ఆకలి తీరుస్తోందన్నారు. సన్నబియ్యం పథకం ముమ్మాటికీ గేమ్‌చేంజర్‌ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 40లక్షల కొత్త రేషన్‌కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వాని కే దక్కిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీ్‌ప చేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో నాయకులంతా కలిసి మునిసిపాలిటీలో గెలుపునకు కృషి చేయడం అభినందనీయమన్నారు. సూర్యాపేటలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీవ్యవస్థ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాష్ట్రవ్యాప్తంగా అనుకూల వాతావరణం ఉందని, 2028లోనూ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంన్నారు. ఎస్సారెస్పీ ఫేస్‌-2 కాల్వ ఆదునీకరణ కోసం ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు-6 ద్వారా త్వరలో తుంగతుర్తి నియోజకవర్గానికి సాగునీరు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రె్‌సలో గ్రూపులు లేవని కేవలం గెలుపులు మాత్రమే ఉన్నాయని స్పష్టంచేశారు. పాత మెయిన్‌రోడ్డు విస్తరణ పేరుతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యాపారులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని, కనీసం కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమే్‌షరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ నాయకులు ఆస్తులు విక్రయించి ప్రజల కోసం పనిచేస్తుంటే బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం అవినీతికి పాల్పడుతూ వేలకోట్ల రూపాయలు సంపాందించుకున్నారని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ, సూర్యాపేట మునిసిపాలిటీలో కాంగ్రె్‌సకు మెజార్టీ సీట్లు లభించడం ఖాయమన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ, గత సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతైందని, ప్రస్తుత మునిసిపల్‌ ఎన్నికల్లో వార్డుల్లో పోటీచేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు., కార్యక్రమంలో నాయకులు చకిలం రాజేశ్వర్‌రావు, తండు శ్రీనివా్‌సయాదవ్‌, పోతు భాస్కర్‌, సంధ్యారాణి, తిరుమల ప్రగడ అనురాధ, అంజద్‌ అలీ, కక్కిరేణి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి మొరిశెట్టి నివేదితలక్షాది, బైరు వెంకన్నగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:41 AM