అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:03 AM
అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. శనివారం భూదానపోచంపల్లిలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా సీతక్క ప్రచారం ప్రచారం నిర్వహించారు.
మంత్రి సీతక్క
భూదానపోచంపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. శనివారం భూదానపోచంపల్లిలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా సీతక్క ప్రచారం ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరుగుతోందని, రానున్న మునిసిపల్ చైర్మన కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే భూదానపోచంపల్లి పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. భువనగిరి నియోజకవర్గంలో రూ. 210 కోట్లతో పైప్‌లైన పనులు జరుగుతున్నాయని, చేనేత కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మునిసిపల్ చైర్మన కాంగ్రెస్ అభ్యర్ధి తడక వెంకటేష్ గెలిస్తే పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుందని అందుకోసం పట్టణంలోని 13 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా సీతక్క కోరారు. కార్యక్రమాల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, చైర్మన అభ్యర్ధి, 12వ వార్డు కాంగ్రె్‌సపార్టీ అభ్యర్ధి తడక వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, జిల్లా నాయకులు కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదనరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, దారెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, పోచంపల్లి అర్బన బ్యాంకు చైర్మన తడక రమేష్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, సూరపల్లి శ్రీనివాస్, టైఅండ్‌డై అసోసియేషన అధ్యక్షుడు బాలరాజు పాల్గొన్నారు.