ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని, తప్పనిసరిగా సమ య పాటించాలని కలెక్టర్ హనుమంతరావు అ న్నారు. మంగళవారం ఆలేరు మండలం శారాజీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మంతపురిలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాన్ని ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌కార్డులను పంపిణీ చేస్తామన్నారు.
భువనగిరి పట్టణంలోని 11వ వార్డులో ఉన్న శ్రీగ్ద కాలనీ శ్రీమంతులు ఉండే ప్రాంతంగా పేరు. చిన్నపాటి ఇల్లు కూడా సుమారు రూ.కోటి ధర పలుకుతోంది. గజం ధర రూ.25వేల పైనే. భారీ భవంతులు, విశాలమైన రహదారులు, గ్రీనరీ, తదితర ఆధునిక హంగులతో పట్టణంలోనే మొట్టమొదటి గేటెడ్ కమ్యూనిటీ కాల నీ. 1918లో ప్రారంభమైన ఈ కాలనీలో సుమారు 60 వరకు ఇళ్లు ఉన్నాయి.
జిల్లా కేంద్రం భువనగిరి పట్టణ ప్రజలను వీధి కుక్కలు భయపెడుతున్నాయి.
భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కారణంగా.. నాగార్జున సాగర్ డ్యామ్ నిండు కుండలా తయారైంది. దీంతో ప్రాజెక్ట్‌లోని నీటిని కిందకి విడుదల చేశారు.
‘ప్రజావాణి’లో వచ్చిన అన్ని దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూసి సత్వర పరిష్కారానికి చొరవ చూపాల ని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావుు అన్నా రు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో వివిధ ప్రాంతాల ప్రజల వినతులు, ఫిర్యాదులకు సంబంధించిన 81 దరఖాస్తులను వారు స్వీకరించారు.
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మౌలిక వసతులు, సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం శివారులో నిర్మిస్తున్న ఔషధ గోదాం పనులు చకా చకా సాగుతున్నాయి. వైద్య సేవలు, మౌలిక వసతుల సదుపాయాల సంస్థ జాతీయ ఆరోగ్య మిషన్ రూ.3.60కోట్లు మంజూరు చేయగా, జూన్ 2న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ గోదాం నిర్మాణ పను లు కొనసాగుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికల నిర్వహణపై తగిన చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నిర్వహణకు సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, సంబంధిత ఖర్చును రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అంచనా వేసి... స్థానికంగా జిల్లా కొనుగోలు కమిటీల ద్వారా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
విద్యార్థులు చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలోని లీగల్ టీం సభ్యులు కోక సబిత, కానుగంటి శ్రీశైలం, బత్తుల గణేష్ అన్నారు.
కరాటేతో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం సమకూరుతాయని పట్టణ ఇన్సపెక్టర్ ఎం.రమేష్ అన్నారు.