లోక్ అదాలత్ పరిష్కారాలు అత్యుత్తమం
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:25 AM
లోక్ అదాలత్ పరిష్కారాలు అత్యుత్తమమైనవని జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు అన్నా రు. శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను భువనగిరిలోని జిల్లా కోర్టులో ఆయన ప్రారంభించి మాట్లాడారు. పరస్పర రాజీతో కేసులను పరిష్కరించుకోవడం తెలివైన నిర్ణయమన్నారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు
జిల్లాలో 36,182 కేసుల పరిష్కారం
కొలిక్కివచ్చిన రూ.22 కోట్ల విలువైన సివిల్ కేసు
భువనగిరి టౌన్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): లోక్ అదాలత్ పరిష్కారాలు అత్యుత్తమమైనవని జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు అన్నా రు. శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను భువనగిరిలోని జిల్లా కోర్టులో ఆయన ప్రారంభించి మాట్లాడారు. పరస్పర రాజీతో కేసులను పరిష్కరించుకోవడం తెలివైన నిర్ణయమన్నారు. కేసుల పరిష్కారంతో కక్షిదారులు ఉపశమనంతోపాటు ఆయా కుటుంబాల్లో ఆందోళన తగ్గుతుందని, ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన న్యాయం జరుగుతుందన్నారు. అలాగే కోర్టులపై కేసులభారం, పని ఒత్తిడి తగ్గి నేర తీవ్రత ఉన్న కేసులపై దృష్టి సారించేందుకు సమయం లభిస్తుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి.స్వాతి, ఏపీవోలు సౌజన్య, చంద్రశేఖర్, జిల్లా లోక్‌అదాలత్ సభ్యులు పిడుగు అయిలయ్య, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 36,182 కేసుల పరిష్కారం
జిల్లాలోని కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 36,182 కేసులు పరస్పర రాజీతో పరిష్కారం అయ్యాయని న్యాయశాఖ అధికారు లు తెలిపారు. ఇందుకోసం జిల్లా కోర్టులలో ఎనిమిది లోక్ అదాలత్ బెంచ్‌లు, హెల్ప్‌డె్‌స్కలు ఏర్పాటు చేశారు.