Share News

సైబర్‌ క్రైం వలలో చిక్కి విలవిల

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:18 AM

స్మార్ట్‌ఫోనలు వచ్చాక సైబర్‌ క్రైం పెరిగిపోతున్నాయి. అమాయకుల భయాన్ని ఆసరా చేసుకుని దోచుకుంటున్నారు. వారం రోజుల కిం దట నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి వాట్సా్‌పకాల్‌ వచ్చింది. ముంబైలో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ వద్ద మీ ఆధార్‌కార్డు దొరికింది.

సైబర్‌ క్రైం వలలో చిక్కి విలవిల

ఉమ్మడి జిల్లాలో 6వేలకు పైగా కేసులు

రూ.53 కోట్లు రికవరీ

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)

స్మార్ట్‌ఫోనలు వచ్చాక సైబర్‌ క్రైం పెరిగిపోతున్నాయి. అమాయకుల భయాన్ని ఆసరా చేసుకుని దోచుకుంటున్నారు. వారం రోజుల కిం దట నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి వాట్సా్‌పకాల్‌ వచ్చింది. ముంబైలో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ వద్ద మీ ఆధార్‌కార్డు దొరికింది. మీపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. బెయిల్‌ రావాలంటే రూ.30,70,719లు చెల్లించాలి అంటూ హెచ్చరించారు. ఎవరికి చెప్పినా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని బెదిరించారు. మీరు హౌస్‌ అరె్‌స్టలో ఉన్నారు ఇల్లు వదిలి వెళ్లొద్దని హెచ్చరించారు. రెండు గంటలకు ఒకసారి అయామ్‌ సేఫ్‌ అని మెసేజ్‌ పంపాలని ఆదేశించారు. అంత డబ్బు ఇచ్చుకోలేమని ప్రాధేయపడటంతో రూ.20 లక్షలైనా డబ్బులు పం పితే బెయిల్‌ ఇప్పించి విడిపిస్తామని నమ్మబలికారు.సమయానికి మెసేజ్‌ పెట్టకుంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేశారా అంటూ వేధించేవారు. దీంతో రిటైర్డ్‌ ఉద్యోగి దంపతులు ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించి విరమించుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే ఫోన చేయడంతో

బెయిల్‌ కోసం బంధుమిత్రుల వద్ద రూ.15 లక్షలు వృద్ధదంప

తులు పోగు చేశారు. మరో రూ.5 లక్షల కోసం మాజీ ఎమ్మెల్యేకు చెప్పి బోరుమన్నారు. ఆయన జిల్లా ఎస్పీ వద్దకు తీసుకవెళ్లి జరిగినందంతా చెప్పడంతో సైబర్‌ క్రైం కేటుగాళ్ల పనిగా తేల్చడంతో చచ్చి బతికినంత పనైందని రిటైర్‌ ఉద్యోగి వాపోయారు. గండం గడిచిందని ఊపిరిపీల్చుకున్నారు.

గత నెల 21న వాడపల్లి పోలీ్‌సస్టేషన పరిధిలో ఓ వ్యక్తి తన ఫోనకు వచ్చిన లింక్‌ ఓపెన చేయడంతో సైబర్‌ నేరస్తుడు ఎనిమిది రోజుల్లో అతడి ఖాతానుంచి రూ.2.20 లక్షలను కాజేశాడు. లాటరీ తగిలిందని మెయిల్‌ పంపడం, ఉద్యోగాల పేరుతో ఫోనకు వచ్చిన లింక్‌లు ఓపెన చేయడం ద్వారా సైబర్‌ నేరగాళ్లు డాటాను చోరి చేసి ఖాతాలను డబ్బులు కొట్టేస్తున్నారు.

అనవసర ఫోనకాల్స్‌కు, లింక్‌లను దూరంగా ఉండాలి

సైబర్‌ క్రైమ్‌లలో నేరస్థులను పట్టుకోవడం కష్టం. ప్రజలు సైబర్‌నేరాలపై అవగాహన పెంచుకోవాలి. అనవసర లింక్‌లు ఓపెన చేయకపోవడం మంచిది. ఉచితంగా డబ్బులు వస్తాయని ఆశకు పోవద్దు. సైబర్‌ దాడులకు గురైనవారు 1930 నెంబరుకు ఫిర్యాదుచేయాలి. బాధితుల పేరు మెయిలింగ్‌ అడ్రస్‌ వివరాలను తెలియజేయాలి. స్థానిక పోలీ్‌సస్టేషనలో సంప్రదించాలి.

పీఎనడీ ప్రసాద్‌, రూరల్‌ సీఐ

Updated Date - Sep 10 , 2025 | 12:18 AM