Telangana Economic Development: ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కీలక కార్యాచరణ
ABN , Publish Date - Sep 15 , 2025 | 08:05 AM
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే నిధులు అవసరం. దీంతో ఆదాయ వనరులను పెంచుకుని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు ప్రారంభించింది.
ఆదాయం పెంచేద్దాం!
రెట్టింపు ఆదాయానికి ప్రభుత్వం కార్యాచరణ
హైదరాబాద్ శివారు ప్రాంతాలపై దృష్టి
పరిశ్రమలు, టూరిజం అభివృద్ధిపై నజర్
విధివిధానాలు రూపొందిస్తున్న అధికారులు
ఆర్‌ఆర్‌ఆర్ సమీపంలోకి పరిశ్రమల తరలింపు?
జిల్లాలో నూతన పారిశ్రామికవాడలపై ఆశలు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను (Telangana Economic Development) బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే నిధులు అవసరం. దీంతో ఆదాయ వనరులను పెంచుకుని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రధానంగా కమర్షియ ల్ ట్యాక్స్, ఎక్సైజ్, గనులు, రిజిస్ట్రేషన్ల శాఖలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఆదాయ వనరుల సమీకరణ, లక్ష్యాలపై ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. లక్ష్య సాధనకు అన్ని శాఖలు పక్కా ప్రణాళికల తో ముందుకు సాగాలని సబ్ కమిటీ అధికారులకు సూచించింది.
- (ఆంధ్రజ్యోతి,యాదాద్రి)
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్ర ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు ప్రభు త్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా అన్ని శాఖలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న ప్రాంతాల్లో ఆదాయం పెంపుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమైంది. జిల్లా నగరానికి చేరువలో ఉండటం తో రియల్ ఎస్టేట్‌తో పాటు ఎక్సైజ్, వాణిజ్య పన్నులశాఖ ద్వారా సర్కారుకు ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు హైదరాబాద్ సమీపం లో ఉన్న జిల్లాలో పారిశ్రామికాభివృద్ధితో పాటు టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు సన్నద్ధమవుతోంది. జిల్లా కేంద్రాల్లో విలువైన భూములను కాపాడేందుకు కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
కీలక శాఖల నుంచి నికరంగా ఆదాయం
జిల్లాలో వాణిజ్య పన్నులశాఖ ద్వారా నెలకు రూ.6కోట్ల నుంచి రూ.8కోట్ల మేర పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఏటా జిల్లా నుంచి ప్రభుత్వానికి మొత్తంగా రూ.60కోట్ల నుంచి రూ.70కోట్ల మేరకు ఆదాయం వస్తోంది. ఎక్సైజ్‌శాఖ ద్వారా జిల్లాలోని నాలుగు స్టేషన్ల పరిధిలో మద్యం విక్రయాలతో రూ.450కోట్ల మేరకు ఆదాయం వస్తోం ది. అదేవిఽధంగా మైనింగ్‌శాఖ పరిధిలో ఖనిజ సంపదను వెలికితీయడం ద్వారా ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో మొత్తం 47 క్రషర్ మిల్లులు, ఏడు గ్రానైట్ కంటింగ్, పాలిషింగ్ మిల్లులు, క్వార్ట్జ్‌మిల్లులు ఉన్నాయి. ఏటా మైనింగ్‌శాఖ ద్వారా రూ.5కోట్ల ఆదా యం సమకూరుతోంది. చౌటుప్పల్, యాదగిరిగుట్ట, భువనగిరి బీబీనగర్, రామన్నపేట, మోత్కూరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూముల విక్రయాల ద్వారా జిల్లా నుంచి ఏటా రూ.150కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఈ శాఖల ద్వారా ప్రభుత్వం మరింత ఆదా య పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు.
జిల్లాలో నూతన పారిశ్రామిక వాడలు
ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు ప్రభు త్వం విధివిధానాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న జిల్లాల్లో నూతనంగా పారిశ్రామికవాడల ఏర్పాటుకు సర్కారు యోచిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో, పలు ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పే అవకా శం ఉంది. జిల్లా పరిధిలో హైదరాబాద్-విజయవాడ(65), హైదరాబాద్-భూపాలపల్లి(163) జాతీయ రహదారులు ఉండటంతో పాటు సమీపంలోనే రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కూడా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్‌రోడ్డు వెంట ఇండస్ట్రియల్ జోన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు ఇప్పటికే జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో పలు పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో టీఎస్ ఐ-పాస్ కింద మొత్తం 1,090 పరిశ్రమలు ఉండగా, వీటి ద్వారా 41,270 మంది ఉపాధి పొందుతున్నారు. టీఐడియా, టీప్రైడ్ పథకాల కింద 796యూనిట్లు మంజూరయ్యాయి. ఈ కం పెనీలతో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్-విజయవా డ జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎంఎ్‌సఎంఈ ఏర్పాటైంది. హరిత పారిశ్రామిక పార్కుకు కావడంతో కాలుష్య సమస్యలేని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 35వేల మందికి ఉపాధి లభిస్తోంది. 2వేల ఎకరాల్లో ఉన్న ఈ ఇండస్ట్రియల్ పార్క్ హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో ఇక్కడికి పరిశ్రమలు తరలివస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో సర్కారుకు భారీగా ఆదాయం సమకూరనుంది. ఈ నేపథ్యంలో మరిన్ని పారిశ్రామికవాడల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించింది.
ఆదాయం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ
జిల్లాలోని హెచ్‌ఎండీఏ, వైటీడీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకప్పుడు జోరుగా సాగింది. జాతీయరహదారులకు ఇరువైపులా ఎక్కడ చూసినా లేఅవుట్లు కన్పించాయి. ప్రస్తుతం ప్లాట్ల విక్రయాలు పూర్తయ్యాయి. కొత్తగా వెంచర్లు, లేఅవుట్లు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. రాష్ట్రంలో అపార్ట్‌మెంట్లు, పాట్ల విక్రయాల్లో మంచి ప్రగతి ఉన్నా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడంలేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో రీజినల్ రింగు రోడ్డు సమీపంలో పరిశ్రమలతోపాటు నూతనంగా పలు ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తే రియల్ వ్యాపారం మరోసారి ఊపందుకోనుంది.
రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తిరుమల స్థాయిలో ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తోంది. తిరుపతి దేవస్థానం(టీటీడీ)తరహాలో ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తోంది. ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులన్నింటికీ టీటీడీ మాదిరిగా స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఆలయ పరిధిలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులతోపాటు ప్రభుత్వ భూములు, ఆలయ అవసరాల కోసం సేకరించిన భూములను వైటీడీ(యాదగిరిగుట్ట టెంపుట్ డెవలె్‌పమెంట్) పరిధిలోకి తీసుకురానుంది. టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్ ఏరియాగా రూపొందించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వం త్వరలోనే టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్ ఏరియాను ఫైనలైజేషన్ చేయనుంది. జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టు పనులపై దృష్టి సారించింది. ఇక ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలతో జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. వరదలతో ఇసుక మేటలు ఏర్పడుతుండగా, ఇసుక ద్వారా ఖజానాకు ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇలా చేస్తే అంతే అంటూ.. నగర జీవికి వార్నింగ్
హనీ ట్రాప్‌లో చిక్కుకున్న యోగా గురువు.. పోలీసుల ఎదుట లబోదిబో..
For More TG News And Telugu news